Praja sangrama Yatra: ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు జననీరాజనం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు ఎవరూ ఊహించని విధంగా అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ సామాజిక, ప్రజా, రైతు, విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు సహా సబ్బండ వర్గాల నాయకుల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో వందలాది మంది సామాజికవర్గ నాయకులు చేవెళ్లకు విచ్చేసి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన […]

Written By: NARESH, Updated On : September 2, 2021 8:57 pm
Follow us on

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు ఎవరూ ఊహించని విధంగా అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ సామాజిక, ప్రజా, రైతు, విద్యార్ధి, నిరుద్యోగ సంఘాలు సహా సబ్బండ వర్గాల నాయకుల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో వందలాది మంది సామాజికవర్గ నాయకులు చేవెళ్లకు విచ్చేసి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ ఆయనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. జిల్లాకు చెందిన విశ్వకర్మ నాయకులు సైతం సంజయ్ యాత్రకు మద్దతు పలికారు. సంగ్రామ యాత్రకు స్వాగతం పలుకుతూ యాదవులు, గౌడులు, రజకులు, దళితులు, జైనులు, నిరుద్యోగులు యువతీ యువకులు ఇలా సబ్బండ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా వారినుద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బిజెపి యాత్రకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. టిఆర్ఎస్ దుర్మార్గ పాలన పోవాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులు, ప్రజలు తన పాదయాత్రకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందు ఉంటానని భరోసా ఇచ్చారు.

•మరోవు గురువారం ఉదయం 11 గంటలకు చేవెళ్ల మోడల్ కాలనీ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. వేలాది సంఖ్యలో జనం పాదయాత్రకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కాషాయమయమైంది. జై బీజేపీ, బండి సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ బండి సంజయ్ తో కలిసి కదం తొక్కారు. యువత, పిల్లలు, వ్రద్దులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంజయ్ తో మాట్లాడేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

•బీజేపీ జాతీయ సంఘటన సహా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శివ ప్రకాష్ ప్రజా సంగ్రామ యాత్ర లో ఇప్పుడు పాల్గొని పాదయాత్ర చేస్తున్నారు. చేవెళ్ల నుండి ప్రారంభమైన పాదయాత్ర దామరగిద్ద గ్రామంలోకి ప్రవేశించే సమయంలో అక్కడున్న పొలాల్లోకి వెళ్లిన బండి సంజయ్ టమాటా పంట రైతుల కష్టాలను తెలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సంజయ్ వారికి అండగా బీజేపీ ఉంటుందని భరోసా ఇస్తూ ముందుకు కదిలారు. దారిలో శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

•అక్కడి నుండి నారాయణపేట గ్రామంలోకి ప్రవేశించగానే గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాణాసంచా పేల్చి స్వాగతం పలికారు. అనంతరం మీర్జా గూడ క్యారెట్ రైతు తిరుమల రాములు కలిసి తన పొలంలోకి తీసుకెళ్లారు. క్యారెట్ పంటను చూపించారు. ఎకరాకు 20 క్వింటాళ్లు పండుతున్నాయని, గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. ప్రభుత్వం సబ్సీడీ ఇస్తే పాలీహౌజ్ ఏర్పాటు చేసుకునేవాళ్లమని, కానీ సర్కార్ నుండి ఏ సాయమూ అందడం లేదని వాపోయారు. కేసీఆర్ మోసపు మాటలను నమ్మి రైతులు మోసపోయారని పేర్కొన్న బండి సంజయ్ వారికి అండగా ఉండేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

•ప్రజా సంగ్రామ యాత్ర లో ఖానాపూర్ గ్రామ సరిహద్దుల లో రోడ్డు పక్కన కూరగాయలు పండించి పంటను అమ్ముకుంటున్న రైతులతో బండి సంజయ్ మాట్లాడారు.

•మీర్జా గూడా గ్రామం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర లో నాగలి పట్టి దున్నారు.

•ఖానాపూర్ సరిహద్దులో పలువురు రైతులతో సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు తమకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేను ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. పైగా తమతో పలుమార్లు బెదిరింపులకు దిగారని వాపోయారు. కూరగాయాలను మార్కెట్ ధర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

•ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ ని కలిసిన కౌలు రైతులు… రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో రుణమాఫీ లక్షకు పైగా అయ్యిందని ఇప్పుడు రుణమాఫీ అని కేసీఆర్ మోసం చేశాడని రైతుల ఫిర్యాదు.. భూమి లేని కౌలు రైతులకు టీఆర్ ఎస్ ఏ విధంగా అదుకోలేదని బీజేపీ అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం చేయాలని బండి సంజయ్ ని కోరారు.

*ఆరో రోజు పాదయాత్రలో పాల్గొన్న నాయకులు….
మాజీ మంత్రి విజయ రామారావు, దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి. మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, పాదయాత్ర సహ ప్రముఖ్ తూళ్ల వీరేందర్ గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్, ఎస్సీ, బీసీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, ఆలె భాస్కర్, గీతామూర్తి, రంగారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, చేవెళ్ల ఇంచార్జ్ కంజర్ల ప్రకాష్, జిల్లా కు చెందిన నాయకులు పలువురు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు.