https://oktelugu.com/

కేసీఆర్, జగన్.. అందులోనూ అన్నాదమ్ములే?

ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్ తో తెలంగాణ ధనికరాష్ట్రంగా మిగలగా.. రాజధాని కూడా లేకుండా ఏపీ 90వేల కోట్ల అప్పులతో నిట్టూరిచ్చింది. నాటి సీఎం చంద్రబాబు అమరావతి పేరిట ఐదేళ్లు గ్రాఫిక్స్ సినిమా చూపించి సంక్షేమ పథకాల కోసం మరింత అప్పు చేసి జగన్ చేతిలో పెట్టారు. ఇక తెలంగాణ సంపన్న మిగులు రాష్ట్రంను కేసీఆర్.. కాళేశ్వరం సహా సంక్షేమ పథకాల కోసం మరింతగా అప్పు చేసి అప్పుల కుప్పల్లో తెలంగాణను చిక్కుకునేలా చేశారు. అయితే తమదైన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 19, 2020 / 06:15 PM IST
    Follow us on

    ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్ తో తెలంగాణ ధనికరాష్ట్రంగా మిగలగా.. రాజధాని కూడా లేకుండా ఏపీ 90వేల కోట్ల అప్పులతో నిట్టూరిచ్చింది. నాటి సీఎం చంద్రబాబు అమరావతి పేరిట ఐదేళ్లు గ్రాఫిక్స్ సినిమా చూపించి సంక్షేమ పథకాల కోసం మరింత అప్పు చేసి జగన్ చేతిలో పెట్టారు. ఇక తెలంగాణ సంపన్న మిగులు రాష్ట్రంను కేసీఆర్.. కాళేశ్వరం సహా సంక్షేమ పథకాల కోసం మరింతగా అప్పు చేసి అప్పుల కుప్పల్లో తెలంగాణను చిక్కుకునేలా చేశారు.

    అయితే తమదైన పాలన మార్క్ చూపించాలని అన్నాదమ్ములుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అప్పులే అభివృద్ధికి సంకేతం అంటూ మరిన్ని అప్పులు చేసి ప్రజలపై సంక్షేమ జల్లు కురిపిస్తున్నారు. తాహతకు మించి అప్పులు చేస్తూ మళ్లీ ప్రజలపైనే భారం మోపుతున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం కోసం అప్పులు చేస్తూ తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నట్టు తాజా నివేదికలో తేలింది.

    Also Read: కేంద్రం డబ్బు.. కేసీఆర్ పేరు?

    రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దేశంలో అప్పులు ఎక్కువగా తీసుకున్న రాష్ట్రాల అప్పుల కుప్పపై బులిటెన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలు అప్పులు తీసుకోవడంలో ముందంజలో ఉండడం విశేషం. అన్నాదమ్ములైన తెలుగు సీఎంలు కేసీఆర్, జగన్ లు అప్పులు తీసుకోవడంలోనూ పోటీపడడం గమనార్హం. జనాభా పరంగా దేశంలోనే మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అప్పులు తీసుకోవడంలోనూ నంబర్ 1గా నిలిచింది. దేశంలో అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రాల్లో యూపీ నంబర్ 1 కాగా.. ఆ తర్వాత తమిళనాడు నిలిచాయి.

    ఇక అప్పులు తీసుకోవడంలో దేశంలోనే మూడో స్థానాన్ని మన ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఏపీలో అప్పులు 42శాతం పెరిగాయి. గత ఏడాది ఏపీలో 6వ స్థానంలో ఉండగా.. ఈ సంవత్సరం మరిన్ని అప్పులు తీసుకొని 3వ స్థానానికి చేరింది.

    Also Read: మామ సీటు కోసం అల్లుడి వేషాలు..!

    ఇక తెలంగాణలో అప్పుల భారం 38శాతం పెరిగింది. అప్పులు తీసుకోవడంలో గత ఏడాది తెలంగాణ 9వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 6వస్థానంలో ఉంది.

    మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు స్థానాలు పైకి ఎగబాకి అప్పులు తీసుకోవడంలో ముందంజలో నిలిచాయి. ఇలా దేశంలోనే అప్పులు తీసుకునే రాష్ట్రాల్లో ప్రముఖంగా నిలిచాయి. కేసీఆర్, జగన్ లు ఏకంగా మూడు మూడు స్థానాలు ఎగబాకడం విశేషం.