లాక్‌డౌన్ కారణంగా గత మూడు నెలలుగా థియేటర్స్ లో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వలేదు. మూవీ షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. కరోనా కారణంగా దేశం మొత్తం ఇబ్బంది పడుతుంటే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారారు. షూటింగ్స్ చేయడమే కాదు వాటిని ఆన్‌లైన్ రిలీజ్ చేసి తెగ సంపాదిస్తున్నాడు. గంటలు, రోజుల వ్యవధిలో సినిమాలు పూర్తి చేయడమే కాకుండా.. డిజిటల్ మార్కెట్ ద్వారా వాటిని రిలీజ్ చేసి తెగ సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాను తనదైన రీతిలో వాడేసుకుంటూ పైసా ఖర్చు లేకుండా తన మూవీస్‌కు ప్రమోషన్ కల్పిస్తున్నాడు.
కంటెంట్ లేని చిత్రాలు తీసి, ట్రైలర్స్‌తో హీట్ పెంచి అసలు సినిమాలతో ఉసూరుమ నిపించడంలో వర్మ ముందుంటాడు. తన ఆర్జీవి వరల్డ్ థియేటర్‌లో క్లైమాక్స్, నగ్నం వంటి మూవీలను రిలీజ్ చేశాడు. నగ్నం కేవలం నాలుగు లక్షల రూపాయలతో తీస్తే ఏకంగా 40 లక్షల పైనే వచ్చాయని సమాచారం. కేవలం 20 నిమిషాల మూవీకి రాము వంద రూపాయాలు చార్జ్ చేశాడు. అదేమంటే చూస్తే చూడండి లేదంటే లేదు అంటున్నాడు. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసిన రాము.. ఇప్పుడు ట్రైలర్ చూపించేందుకూ చార్జ్ చేస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ విషయంలో అదే చేస్తున్నాడు.
Also Read: ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ
తాజాగా ‘పవర్ స్టార్’ సినిమా విడుదల గురించి ఆర్జీవీ అనౌన్స్ చేశారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో జులై 25 ఉదయం 11గంటలకు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. అంతకంటే మూడు రోజుల ముందు.. అంటే జులై 22న మూవీ ట్రైలర్ను రిలీజ్ చేస్తానని తెలిపాడు. ట్రైలర్ రిలీజ్ అంటే అందరూ యూట్యూబ్ వైపు చూస్తారు. కానీ, ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రావడం లేదు. ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’లోనే ఉంటుందని, ఒక సారి ట్రైలర్ చూడాలంటే రూ.25 కట్టి చూడాలన్నాడు. దీనికి సంబంధించి బుకింగ్స్ ప్రారంభమైనట్లు తెలిపాడు. అంతేకాదు ఇది ప్రపంచంలోనే ఫస్ట్ పెయిడ్ ట్రైలర్ అని గొప్పలు చెప్పుకుంటున్నాడు.
ఈ సినిమా కోసం రూ. 150తో పాటు జీఎస్టీ కట్టి టికెట్లను బుక్ చేసుకోవచ్చన్నాడు. ఈ ఆఫర్ జులై 25 ఉదయం 11గంటల వరకు మాత్రమే ఉంటుందని తెలిపాడు.లేదంటే బ్లాక్ టికెట్లు కొనాల్సి వస్తుందంటున్నాడు. ఇప్పటికే పలు ఇంట్రస్టింగ్ పోస్టర్స్‌తో ‘పవర్స్టార్’పై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచాడు.
Also Read: కరోనాతో సీనియర్ నటుడి మృతి