ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వారానికి ఓ లేఖ రాస్తూ…రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఎత్తిచూపుతున్న సర్సాపురం ఎంపీ రాఘురామ కృష్ణంరాజు తాజాగా సిఎంకు మరో లేఖ రాశారు. తాజాగా రాసిన లేఖలో గోశాల అభివృద్ధికి కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో 2005లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి గోశాల అభివృద్ధికి కమిటీలు వేశారని తెలిపారు. ప్రస్తుతం సింహాచలం దేవస్ధానంలో మూడు గోవులు మృతి చెందాయన్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి గోశాలలో వంద ఆవులు మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి గోశాలల అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read: వైసీపీ ఎంపీకి లోక్ సభలో సీటు ఛేంజ్..
ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ లేఖల రాసే అలవాటును బీజేపీ నుంచి వంట బట్టించుకున్నారా అంటే అవుననే నమాధానం వస్తుంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాష్ట్రంలో వివిధ సమస్యలపై ప్రతి వారం లేఖలు రాసి వంద లేఖలు అయిన అనంతరం పుస్తకంగా ప్రచురించారు. ఇప్పుడు సీఎం జగన్ కు అదే విధంగా లేఖలు రాస్తున్నారు. తెలంగాణా బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ హైదరాబాదులో ఉన్న సమయంలో సిఎం కేసీఆర్ కు వివిధ సమస్యలపై తరచూ లేఖలు రాసేవారు.
Also Read: సీటు మారినా పర్లేదు…ఫేటు మారకుండా చూసుకో రాజా..!
బీజేపీతో సన్నిహిత సంబందాలు ఉన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ నాయకుల తరహాలోనే ఇప్పుడు వారానికి ఓ సమస్యపై సిఎంకు లేఖలు రాస్తున్నారు. మొదటి లేఖలో వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు తగ్గించాలని, రెండవ లేఖలో భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేలు సాయం పంపిణీ చేయాలని, తాజా లేఖలో గోశాల అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాసిన లేఖలపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ స్పందించలేదు.