రాహుల్ జాతీయ నాయకుడు కాదంటున్న సీనియర్ నేత..!

“రాహుల్ గాంధీకి జాతీయ నేత లక్షణాలు లేవు” ఇదీ.. బీజేపీ నేతలు తరచూ చేసే విమర్శ. ప్రధాని మోదీకి ఈయన ధీటైన నేతకాదని వారు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే విమర్శను.. యూపీఏ కూటమిలోని పార్టీలు కూడా చేస్తుండటం గమనార్హం. త్వరలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తరుణంలో చేసిన ఈ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. Also Read: కన్నా చూపు ఆ వైపు..? పవార్ విమర్శనాస్త్రాలు.. కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి […]

Written By: Neelambaram, Updated On : December 11, 2020 10:52 am
Follow us on


“రాహుల్ గాంధీకి జాతీయ నేత లక్షణాలు లేవు” ఇదీ.. బీజేపీ నేతలు తరచూ చేసే విమర్శ. ప్రధాని మోదీకి ఈయన ధీటైన నేతకాదని వారు అంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే విమర్శను.. యూపీఏ కూటమిలోని పార్టీలు కూడా చేస్తుండటం గమనార్హం. త్వరలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తరుణంలో చేసిన ఈ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Also Read: కన్నా చూపు ఆ వైపు..?

పవార్ విమర్శనాస్త్రాలు..
కాంగ్రెస్ అధ్యక్ష పీఠానికి ఏడాదిన్నర క్రితం రాజీనామా చేసిన రాహుల్.. పార్టీలోని నేతల ఒత్తిడితో త్వరలో మళ్లీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇలాంటి సందర్భంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీని జాతీయనేతగా అంగీకరించలేమని పవార్ అన్నారు. ఆయనకు స్థిరత్వం లేదన్నది ప్రధాన విమర్శ. కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దేనికైనా నిలబడాలి..
ఒక పార్టీని నడిపించే నేత.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ధైర్యంగా నిలబడాలి. గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడి, నేతలు.. కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించాలి. కానీ.. రాహుల్ గాంధీకి ఆ నైజం లేదనేది విమర్శకుల అభిప్రాయం. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలుకాగానే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడాదిన్నర ఖాలంగా.. ఆ పదవి ఖాళీగానే ఉన్నట్టు లెక్క. ఈ చర్యతో.. ఒక జాతీయ పార్టీకి నాయకత్వాన్ని లేకుండా చేశారన్న అపవాదును రాహుల్ గాంధీ మూట గట్టుకున్నారు. ఓటమి సమయంలో పార్టీకి అండగా ఉండి, క్యాడర్ ను ఉత్తేజ పర్చాల్సిన రాహుల్.. పార్టీ పగ్గాలు వదిలేయడాన్ని తప్పు బడుతున్నారు.

Also Read: రెడ్డి వర్సెస్ బీసీ.. టీపీసీసీ ఎవరికీ దక్కనుంది?

ఎన్నికలప్పుడే ప్రజల్లో..
అంతే కాకుండా.. ప్రజలతో రాహుల్ సంబంధాలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం ఎన్నికలప్పుడే ప్రజల్లో ఉంటారని, ఆ తర్వాత విదేశీ టూర్లు పెట్టుకుంటారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తీరువల్లనే ఆయనను స్థిరత్వం లేని నేతగా శరద్ పవార్ అభివర్ణించారని కొందరు అంటున్నారు. ఇకనైనా రాహుల్ గాంధీ తన తీరును మార్చుకుని పార్టీని ముందుకు నడిపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, రాహుల్ ఏమంటారో..??

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్