ఇద్దరూ ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదించేటప్పుడు విపక్షాలు మాత్రమే నిరసన తెలిపాయి. కానీ.. ఇప్పుడు రైతుల ఆందోళనతో సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే.. నిజానికి ప్రభుత్వాలు తెస్తున్న చట్టాల్లో ఏముంటుందో చాలా మంది సామాన్య జనానికి తెలియదు. ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాల విషయంలోనూ ఇంతే. అయితే.. రైతులు తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తున్నారు కాబట్టి.. వారికి మద్దతివ్వాల్సిందేనని కొందరు ముందుకు వస్తున్నారు. బీజేపీ […]

Written By: Neelambaram, Updated On : December 11, 2020 11:08 am
Follow us on


మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్‌లో బిల్లులు ఆమోదించేటప్పుడు విపక్షాలు మాత్రమే నిరసన తెలిపాయి. కానీ.. ఇప్పుడు రైతుల ఆందోళనతో సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే.. నిజానికి ప్రభుత్వాలు తెస్తున్న చట్టాల్లో ఏముంటుందో చాలా మంది సామాన్య జనానికి తెలియదు. ఇప్పుడు ఈ వ్యవసాయ చట్టాల విషయంలోనూ ఇంతే. అయితే.. రైతులు తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తున్నారు కాబట్టి.. వారికి మద్దతివ్వాల్సిందేనని కొందరు ముందుకు వస్తున్నారు. బీజేపీ నేతలు, మద్దతు దారులు మాత్రం తమ పార్టీ చట్టం చేసింది కాబట్టి సమర్థించాల్సిందే అని మద్దతు తెలుపుతున్నారు. కొందరు ఆ చట్టాలతో ఎలాంటి ప్రమాదం ఉందో చెబుతుండగా.. మరికొందరు వాటివల్ల ఉపయోగాలేంటో చెబుతున్నారు. ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగానే సాగుతోంది.

Also Read: కన్నా చూపు ఆ వైపు..?

జేపీ.. జేడీ మద్దతు..
లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇద్దరూ ఈ చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. టీవీ చానళ్ల డిబేట్లలో చట్టాలను సమర్థిస్తున్నారు. ఎందుకు సమర్థిస్తున్నామో చెబుతున్నారు. అయితే.. చట్టాలను వ్యతిరేకిస్తున్న వారి నుంచి సూటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వ్యవసాయంలోకి కార్పొరేట్ వ్యాపారస్థులు దిగితే.. భవిష్యత్ లో జరగబోయే పరిణామాలను చెబుతున్నారు. వీటికి వీరు చెప్పే సమాధానాలు వీరు చెబుతున్నారు. అంతిమంగా ఇద్దరూ ఆ చట్టాల్ని సమర్థిస్తున్నారు.

Also Read: రెడ్డి వర్సెస్ బీసీ.. టీపీసీసీ ఎవరికీ దక్కనుంది?

రాజకీయ ప్రయోజనమేనా..?
అయితే.. ఈ వ్యవసాయ చట్టాలను వీరు ఇద్దరూ సమర్థించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారి రాజకీయ ప్రయోజనాలకోసమే ఈ చట్టాలను సమర్థిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి.. జయప్రకాష్ నారాయణకు మొదటి నుంచి మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆయన బీజేపీ తరపున జాతీయ స్థాయిలో ఏదో ఓ నామినేటెడ్ పదవి పొందుతారన్న ప్రచారం కూడా జరిగింది. ఇక, లక్ష్మీనారాయణ కూడా.. బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొద్ది రోజులుగా సాగుతోంది. ఇప్పుడు వీరిద్దరూ వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతుండటంతో.. కేవలం వారి రాజకీయ ప్రయోజనాలకోసమే సపోర్టు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్