Rahul Gandhi record highlighted by BJP: వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత.. పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాన్ని కైవసం చేసుకున్న తర్వాత.. బిజెపి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. తమిళనాడులో కూడా నిర్ణయాత్మక పాత్రను బిజెపి ఆధ్వర్యంలోని ఏఐడీఎంకే పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపి సోషల్ మీడియా విభాగం కాంగ్రెస్ పార్టీ మీద దాడిని పెంచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు ప్రారంభించింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓటములను తేదీలు, సంవత్సరాలతో పేర్కొంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది బిజెపి ఐటి విభాగం.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపిని ఇబ్బంది పెట్టింది. చాలావరకు పార్లమెంటు స్థానాన్ని గెలుచుకొని.. కమలం పార్టీకి షాక్ ఇచ్చింది. దీంతో బిజెపి టిడిపి టిడిపి, నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బిజెపి ఇక ఏమాత్రం ఆలస్యం చేయలేదు. జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ జోరు చూపించింది. కాంగ్రెస్ లేని భారతదేశం అనే నినాదాన్ని నిజం చేసి చూపించే విధంగా ప్రయత్నించింది. ప్రతి ఎన్నికల్లోను జోరు చూపించింది. చెప్పుకోదగ్గ స్థాయి నుంచి మొదలు పెడితే.. అధికారాన్ని దక్కించుకునే స్థానాలను సొంతం చేసుకుని అదరగొట్టింది.
వెస్ట్ బెంగాల్ లో ఘనవిజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీకి బిజెపి సెటైర్లు వేసింది. రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు.. ఉప ఎన్నికలను ప్రస్తావిస్తూ.. 99 ఓటములతో రాహుల్ గాంధీ రికార్డ్ సృష్టించారని ఎద్దేవా చేసింది.”రాష్ట్రాలు మారుతున్నాయి. సంవత్సరాలు మారుతున్నాయి. ఫలితం మాత్రం దాదాపుగా మారదు. ఆర్భాటం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. నినాదాలు ఎత్తుకుంటున్నారు. అవకాశానికి తగ్గట్టుగా నినాదాలను మార్చేసుకుంటున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఫలితాలు ఒక విధంగా ఉంటాయి.. ఆ ఫలితం పేరు ఓటమి.. ఈ ఓటమి మీతో వస్తూనే ఉంటుంది. వెల్ డన్ రాహుల్ జి” అంటూ బిజెపి సోషల్ మీడియా పేర్కొంది.
వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ మమతాకు సపోర్ట్ చేయలేదు. ఒంటరిగానే పోటీ చేసింది.. మమతను విమర్శిస్తూ రాహుల్ గాంధీ ప్రచారం చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ బెంగాల్ ఓటర్ల మనసును చూరగొనలేకపోయారు. దీంతో బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితం వచ్చింది.. దీనిని ఉద్దేశించి బిజెపి ఐటి విభాగం బీభత్సంగా పోస్టులు చేయడం మొదలుపెడుతోంది. ఇదే సమయంలో అధికార టిఎంసి మీద రెచ్చిపోయింది. ఒక రేంజ్ లో విమర్శలు చేస్తోంది. మోడీ నాయకత్వమే వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి బలమని బిజెపి సోషల్ మీడియా చెబుతోంది.
, . ️⃣️⃣
99 losses and counting isn’t just a statistic, it’s practically a streak. Across states, across years, across narratives, the… pic.twitter.com/PSmh3yuagE
— BJP (@BJP4India) May 4, 2026