YS Jagan Meet rahul Gandhi :జగన్ ఇండియా కూటమి వైపు అడుగులు వేస్తున్నారా? కాంగ్రెస్ తో చేతులు కలపనున్నారా? అందుకే తరచూ బెంగుళూరు వెళ్తున్నారా? డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ ఓటమి తర్వాత జగన్ వరుసగా బెంగళూరు వెళ్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కంటే బెంగళూరులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో రకరకాల ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ తాజా పర్యటనలు కీలక ట్విస్ట్ ఒకటి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని జగన్ కలిసినట్లు సమాచారం. వారిద్దరి మధ్య చర్చలు జరిగాయని.. కాంగ్రెస్ లో వైసీపీ విలీనంపై సుదీర్ఘ మధనం సాగినట్లు తెలుస్తోంది. అయితే జగన్ గొంతెమ్మ కోరికలు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కాంగ్రెస్ తో విభేదించి తప్పు చేశారని.. అప్పుడు కూడా వెయిట్ చేయలేకపోయారని.. సీఎం పదవిని డిమాండ్ చేశారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ పార్టీకిఇబ్బంది పెట్టారని.. ఏపీలో నామరూపాలు లేకుండా చేశారని రాహుల్ గుర్తు చేసినట్లు సమాచారం. అప్పట్లో అనాలోచిత నిర్ణయం వల్లే కాంగ్రెస్ ఈ పరిస్థితికి దారితీసిందని చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో వైసీపీ షరతుగా విలీనం చేస్తే.. నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని రాహుల్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని జగన్ కు సమయం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. మరోసారి సమావేశం అవుదామని.. అప్పుడు నీ నిర్ణయం చెప్పవచ్చని జగన్ కు రాహుల్ సముదాయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
* జగన్ కు ఆప్షన్ లేదు
ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. జగన్ కు ఆప్షన్ లేకుండా పోయింది. గతం మాదిరిగా బిజెపి నుంచి ఆశించిన స్థాయిలో సాయం కూడా దక్కేలా లేదు. పైగా రాజకీయ ఇబ్బందుల్లో ఉండడంతో కేంద్ర ప్రజలు పట్టించుకోవడం మానేశారు. అటు కేసులపరంగా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జాతీయస్థాయిలో పార్టీల అండ అవసరం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటే.. ఏపీలో సోదరి షర్మిలను నియంత్రించవచ్చు.కేసుల విషయంలో ఇండియా కూటమి పార్టీల మద్దతు పొందవచ్చు. బహుశా ఈ ఆలోచనతోనే జగన్ కాంగ్రెస్కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* ఇండియా కూటమి మద్దతు
ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయి అంటూ ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. అప్పటినుంచి జగన్ కాంగ్రెస్తో చేతులు కలుపుతారని ప్రచారం సాగింది. అయితే దీనిపై ఎటువంటి ఖండన రాలేదు. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో జగన్ చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే జగన్ తరచూ బెంగళూరు వెళ్తుండడం వెనుక కాంగ్రెస్ కారణం అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇప్పుడు అది నిజమని తేలింది.
* మనుగడ చాలా కష్టం
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ మనుగడ చాలా కష్టం. పార్టీ నుంచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. వారిని నిలువరించడం అసాధ్యం. అయితే పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలంతా ఏ పార్టీలో చేరడం లేదు. వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. మరోవైపు వైసీపీ కీలక నేతలతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు జగన్ కు సమాచారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేయడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. మరి రాహుల్ కోరినట్లు బేషరతుగా పార్టీని విలీనం చేస్తారో? లేకుంటే గతం మాదిరిగా మొండి ధైర్యంతో పార్టీని నడుపుతారో? అన్నది తెలియాల్సి ఉంది.