https://oktelugu.com/

Gurucharan : యాక్టర్ గురుచరణ్ ఛాయ్, పకోడీల కోసమే ఆశ్రమాలకు వెళ్లేవాడా..? ఆయన అప్పు ఎంతో తెలుసా..?

కొంత కాలంగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న యాక్టర్ గురుచరణ్ గత ఏప్రిల్ లో కనపించకుండా పోయాడు. ఆ తర్వాత నెలకు ఆయన ఆచూకీ లభించింది. ఈ మధ్య సమయంలో ఆయన ఏంచేశాడు.. ఎక్కడ ఉన్నాడు.. అనే విషయాలను వివరించాడు. వీటిని వింటే ఆశ్చర్యం కలుగకమానదు.

Written By:
  • NARESH
  • , Updated On : August 13, 2024 / 05:16 PM IST

    Actor Gurucharan

    Follow us on

    Gurucharan : తారక్ మెహతా కా ఉల్టా చష్మా’ నటుడు గురుచరణ్ తాజాగా మాట్లాడుతూ తాను కనిపించకుండా పోయిన సందర్భంలో జరిగిన విషయాలను పంచుకున్నాడు. నెల పాటు ఆయన ఢిల్లీ వదిలి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సుమారు రూ. 1.20 కోట్లు అప్పు చేసినట్టు వివరించారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 22న అదృశ్యమయ్యారు. తిరిగి 25 రోజుల తర్వాత ఆచూకీ లభించింది. ఢిల్లీలో కనిపించకుండా పోయిన గురుచరణ్, తిరిగి ముంబైలో ప్రత్యక్షం అయ్యారు. ఆ తర్వాత రెండు నెలలు తాజాగా ఆయన తాను కనిపించకుండా పోయిన కారణాలు, తాను పడిన కష్టాలను సిద్ధార్థ్ కన్నన్ తో పంచుకున్నారు. అయితే తాను ఈ 25 రోజుల పాటు ద్రవాహారం మాత్రమే తీసుకున్నట్లు చెప్పాడు. ఇప్పుడు 34 వ రోజు కూడా నేను ఘనాహారం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే నేను ఎక్కువగా గురూజీ ఆశ్రమాలకు వెళ్తుంటాను. అక్కడ సోమవారాలు సమెసా, బ్రెడ్ పకోరా, టీ, స్వీట్స్ ఎక్కువగా ఆస్వాదిస్తాను. అని చెప్పారు. కాగా, ఇలా చేయడానికి కారణాలను కూడా గురుచరణ్ ఈ చర్చలో పంచుకున్నాడు. ఆయన మాటల్లోనే.. ‘ నేను నాలుగేళ్లుగా వివిధ వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తున్నాను.. కానీ వైఫల్యాలే ఎదుర్కుంటున్నాను.. నేను చాలా అలసిపోయాను.. ఏకాంతంగా ఉండాలని అనుకున్నాను.. తిరిగి డబ్బు సంపాదించడం ప్రారంభించాలి.. నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను.. చేసిన అప్పులు కూడా తీర్చాలని అనుకుంటున్నాను.. అని చెప్పాడు. తాను బ్యాంకులకు ఈఎంఐలు సుమారు రూ. 55 లక్షల నుంచి రూ.. 60 లక్షల వరకు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. తన స్నేహితులకు కూడా సుమారు రూ. 1.20 కోట్ల ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.

    అయితే గురుచరణ్ ఏప్రిల్ లో ముంబైకి విమానంలో వెళ్లడానికి ఢిల్లీలోని ఇంటి నుంచి బయల్దేరాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న సాయంత్రం ఢిల్లీ నుంచి ముంబైకి విమానం ఎక్కాల్సి ఉంది. కానీ అతడు గమ్యాన్ని చేరుకోలేదు. దీంతో అంతటా అలజడి మొదలైంది. గురుచరణ్ కనిపించకుండా పోయాడనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
    అంతా ఏం జరిగిందోననే చర్చ మొదలైంది. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, గాలింపు మొదలుపెట్టారు. చివరాఖరుకు ఆయన ఆచూకీని కనిపెట్టారు. పోలీసులు ఆయనతో దిగిన ఫొటోను ఎక్స్ లో పెట్టడంతో ఆయన క్షేమంగా ఉన్నట్లు బాహ్య ప్రపంచానికి తెలిసింది. గురుచరణ్ మే 18న తన ఇంటికి తిరిగి వచ్చాడు.

    ఆయన కనిపించకుండా పోయారని తెలుసుకున్న అభిమానులు, తిరిగి క్షేమంగా ఇంటికి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆయన కొంత మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మాత్రం పోలీసుల ప్రకటన ద్వారా తెలిసింది. ఆయన హిమాలయాలకు వెళ్లాలని అనుకున్నట్లు మాత్రం ప్రకటించారు.

    ఇక టీవీ షో ‘తారక్ మెహతా కా ఉల్టా చష్మా’లో నటించిన గురుచరణ్ రోషన్ సింగ్ సోధీ పాత్రతో అలరించారు. ఆయన ఈ సరీస్ ద్వారా విశేష ప్రేక్షాకాదరణ పొందారు. తండ్రి అనారోగ్యం కారణంగా ఈ షో నుంచి 2020లో తప్పుకున్నారు.