https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 లో ఖరారైన చివరి 16 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..లిస్ట్ లో చేరిన ఇద్దరు స్టార్ హీరోలు!

యూట్యూబ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కాకినాడ పిల్ల కూడా ఖరారు అయ్యిందట. అలాగే బంచిక్ బబ్లూ, కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యుమ్, రేఖా భోజ్, యాదమరాజు, నటి సనా, జబర్దస్త్ పవిత్ర, హారిక, యాష్మి గౌడా, ఇంద్రనిల్, నిఖిల్ పేర్లు ఖరారు అయ్యాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 05:49 PM IST

    Bigg Boss 8 Telugu(4)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సరికొత్త సీజన్ హవా మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. టీవీ లలో కూడా లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలను నాన్ స్టాప్ గా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. గత సీజన్ అతి పెద్ద హిట్ అవ్వడంతో ఈ సీజన్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత సీజన్ కంటే మెరుగైన ఆలోచనలు టాస్కులతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సీజన్ లో జరగబోయే ప్రతీ సంఘటన అన్ లిమిటెడ్ అనే విషయం అందరికీ అర్థం అయిపోయింది. ఆ కాన్సెప్ట్ ని జనాల్లోకి బాగా తీసుకొని వెళ్లడం లో సక్సెస్ అయ్యారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుండి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబోతున్న ఈ సరికొత్త సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇప్పుడు ఖరారు అయ్యింది.

    ఇదేంటి ఇన్ని రోజులు సోషల్ మీడియా లో కంటెస్టెంట్స్ ఖరారు అయ్యారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా ఇదేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇన్ని రోజులు మీరు విన్న పేర్లు మొత్తం బిగ్ బాస్ టీం పరిగణలోకి తీసుకున్న కంటెస్టెంట్స్ మాత్రమే. ఇప్పుడు చెప్పబోతున్నది బిగ్ బాస్ యాజమాన్యం తో ఈ షో లో పాల్గొనేందుకు అగ్రిమెంట్ తీసుకున్న కంటెస్టెంట్స్ గురించి. వారిలో ఇప్పటికే గత సీజన్ అమర్ దీప్ సతీమణి తేజస్విని గౌడా, అంజలి పవన్, రీతూ చౌదరి అగ్రిమెంట్ చేసుకున్న విషయం మన అందరికీ తెలుసు. వీరితో పాటుగ నీతోనే డ్యాన్స్ ఫేమ్ అక్షిత, యాంకర్ విష్ణు ప్రియ కూడా అగ్రీమెంట్స్ మీద సంతకం చేసినట్టు తెలుస్తుంది. అలాగే మన చిన్నతనం లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాలో హీరో గా నటించిన ఆదిత్య ఓం తో కూడా బిగ్ బాస్ యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకుందట. ఇతగాడు మీడియా కి దూరంగా ఉన్నాడు కానీ, ఇంస్టాగ్రామ్ లో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటాడు. అంతే కాదు ఇతనికి 1 మిలియన్ కి పైగా ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

    ఇది ఇలా ఉండగా యూట్యూబ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకున్న కాకినాడ పిల్ల కూడా ఖరారు అయ్యిందట. అలాగే బంచిక్ బబ్లూ, కమెడియన్ అలీ సోదరుడు ఖయ్యుమ్, రేఖా భోజ్, యాదమరాజు, నటి సనా, జబర్దస్త్ పవిత్ర, హారిక, యాష్మి గౌడా, ఇంద్రనిల్, నిఖిల్ పేర్లు ఖరారు అయ్యాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న క్రేజీ స్టార్ హీరో అబ్బాస్ కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కానీ రెమ్యూనరేషన్ విషయం లో ఆయనతో ఇంకా భేరాలు చేస్తున్నారట బిగ్ బాస్ టీం.