Homeజాతీయ వార్తలుRahul Gandhi : ఓట్ల కోసమే రాహుల్ మొసలి కన్నీరు.. కుల గణన అందుకే వ్యతిరేకిస్తున్నాడా?

Rahul Gandhi : ఓట్ల కోసమే రాహుల్ మొసలి కన్నీరు.. కుల గణన అందుకే వ్యతిరేకిస్తున్నాడా?

Rahul Gandhi :  దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా.. ప్రస్తుతం వినిపిస్తున్న డిమాండ్‌ కుల గణన. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అంశమే. కాంగ్రెస్‌ ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో ఈ అంశాన్ని తన మేనిఫెస్టోలో కూడా చేర్చింది. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. పలు ఎన్నికల ప్రచార సభల్లో తాము గెలిస్తే దేశ వ్యాప్తంగా కల గణన చేస్తామని కూడా తెలిపారు. అయితే బీజేపీ మాత్రం కుల గణనపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. అనుకూలమా.. వ్యతిరేకమా అన్న విషయాన్ని కూడా వెల్లడించడం లేదు. కానీ, జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీల వరక అన్నీ కుల గణనకు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే బిహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఆయా రాష్ట్రా్టల ప్రభుత్వాలు కులగణన చేపట్టాయి. అయితే రిజర్వేషన్లు మాత్రం పాతవే అమలు చేస్తున్నాయి. రిజర్వేషన్లు పెంచాలంటే.. కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. కేంద్రం కుల గణన చేయాలని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేస్తున్నారు. రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ చేస్తున్న డిమాండ్‌పై కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ మండిపడ్డారు. జేడీయూకు చెందిన రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ తాము బిహార్‌లో కుల గణన చేపడితే దానిని రాహుల్‌ గాంధీ వ్యతిరేకించారని తెలిపారు. ఇప్పుడు కుల గణన చేపట్టాలని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కుల గణన పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూసుత్నా ్నరని మండిపడ్డారు.

బిహార్‌లో కుల గణన వద్దని..
తాము బిహార్‌లో యూపీఏతో కలిసి ఉన్నప్పుడు బిహార్‌లో కుల గణన చేపట్టామన్నారు. తమ నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ వ్యతిరేకించారని, ఆందోళన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ ఒత్తిడి కారణంగానే రాహుల్‌ కుల గణను వ్యతిరేకించారని తెలిపారు. ఇప్పటికే కుల గణన పూర్తి చేసిన బీహార్‌ను రాహుల్‌ ఎందకు అభినందించడం లేదని ప్రశ్నించారు. ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు రావాలన్న ఆశయంతోనే తాము కుల గణన డిమాండ్‌ చేస్తున్నామని రాహుల్‌ గాంధీ అంటున్నారు. కానీ, రాహుల్‌ గతంలో కుల గణను వ్యతిరేకించి.. ఇప్పుడు కుల గణన డిమాండ్‌ చేయడం ఏంటని జేడీయూ మండిపడుతోంది.

ఎన్నికల అస్త్రమేనా..
ఇదిలా ఉంటే రాహుల్‌ గాంధీన కుల గణన డిమాండ్‌ ఎన్నికల అస్త్రమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్‌లో కుల గణనను ఎందుకు వ్యతిరేకించారన్న చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాహుల్‌ కుల గణన డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌లో కుల గణన చేయకుండా.. దేశంలో కుల గణనకు పట్టుపట్టడం ఎన్నికల కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిత్తశుద్ధి ఉంటే.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular