https://oktelugu.com/

చిన్నారి ఆ కోరికను తీర్చిన రాహుల్ గాంధీ

ఆ చిన్నారికి విమానం అంటే పిచ్చి.. ఎప్పటికైనా విమాన పైలెట్ కావాలని ఆశ. అయితే తన ఆశను తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు బయటపెట్టడాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కన్నూర్ జిల్లాలోని ఇరిట్టి ప్రాంతంలో అద్వైత్ అనే 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కలిశాడు. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే.. ‘పైలెట్ అవ్వాలన్నది’ తన చిరకాల వాంఛ అని ఆ బాలుడు చెప్పాడు. తనకు ఎగరాలని ఉందని.. ఒక్కసారి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2021 / 03:32 PM IST
    Follow us on

    ఆ చిన్నారికి విమానం అంటే పిచ్చి.. ఎప్పటికైనా విమాన పైలెట్ కావాలని ఆశ. అయితే తన ఆశను తాజాగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందు బయటపెట్టడాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కన్నూర్ జిల్లాలోని ఇరిట్టి ప్రాంతంలో అద్వైత్ అనే 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కలిశాడు. పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే.. ‘పైలెట్ అవ్వాలన్నది’ తన చిరకాల వాంఛ అని ఆ బాలుడు చెప్పాడు. తనకు ఎగరాలని ఉందని.. ఒక్కసారి చాన్స్ రావాలన్నాడు.

    ఆ మరుసటి రోజే.. రాహుల్ గాంధీ ఏకంగా ఆ పిల్లాడి కలను నెరవేర్చాడు. అద్వైత్ కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించాడు. చిన్నారిని కాలికట్ విమానాశ్రయానికి తీసుకెళ్లి విమానం ఎక్కించారు. కాక్ పిట్ అంతా చూపించాడు. కాక్ పిట్ లో ఏమేం ఉంటాయో పైలెట్ తో కలిసి బాలుడికి వివరించాడు.

    విమానం ఎక్కగానే సంభ్రమాశ్చార్యాల్లో మునిగి శ్రద్ధగా వింటున్న బాలుడి వీడియోను రాహుల్ గాంధీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

    ‘ఏ కల పెద్దది కాదు. అద్వైత్ తన కలను నిజం చేసుకునేందుకు మేం చిన్న సాయం చేశాం. ఇప్పుడు అతడు ఎగరడానికి అన్ని అవకాశాలు లభించే సమాజాన్ని వ్యవస్థను సృష్టించాల్సిన బాధ్యత మనదే’ అని కాంగ్రెస్ నేత రాసుకొచ్చాడు.

    రాహుల్ గాంధీ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.