దేశంలో రోజురోజుకు పాత కాయిన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఒకవైపు పాత కాయిన్లను సేకరించే వారి సంఖ్య పెరుగుతుంటే మరోవైపు అరుదైన కాయిన్లను లక్షలు చెల్లించి కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే కొనేవాళ్లు మరీ పురాతన నాణేలైతే మాత్రమే లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 1885 సంవత్సరం నాటి రూపాయి కాయిన్ కు మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది.
బ్రిటిష్ కాలంలో ఉన్న రూపాయి నాణెం ఆన్ లైన్ లో లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. ఇండియా మార్ట్, ఈబే వెబ్ సైట్లతో పాటు మరికొన్ని వెబ్ సైట్ల ద్వారా పాత కాయిన్లను విక్రయించే అవకాశం ఉంటుంది. ఈ కాయిన్ కాకుండా మరే పాత కాయిన్ ఉన్నా కూడా ఆన్ లైన్ కూడా సులభంగా విక్రయించవచ్చు. పాత కాయిన్లను విక్రయించడమే వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించే వాళ్లు చాలామంది ఉన్నారు.
ఓఎల్ఎక్స్ లాంటి వెబ్ సైట్లు కూడా పాత నాణేలను సులభంగా అమ్మే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంటే ఆన్ లైన్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఒక్క నాణెం అమ్మితే లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంటుంది. సులభంగా డబ్బు సంపాదించాలని అనుకునే వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
1900 సంవత్సరం లోపు కాయిన్లు లక్షల రూపాయలు పలుకుతోంటే 1900 తర్వాత కాయిన్లు మాత్రం వేల రూపాయలు పలుకుతున్నాయి. కొన్ని వెబ్ సైట్లు నచ్చిన అమౌంట్ ను కోట్ చేసుకునే అవకాశం కల్పిస్తుండటంతో సులువుగా నాణేలు విక్రయించి ఎక్కువ మొత్తం పొందవచ్చు.