Homeజాతీయ వార్తలురాహుల్ గాంధీ ఇక స్టిక్ట్ ఆఫీసర్ అట?

రాహుల్ గాంధీ ఇక స్టిక్ట్ ఆఫీసర్ అట?

Rahul Gandhiకాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించారు. పార్టీ విషయంలో నిక్కచ్చిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలను ఎక్కడికక్కడ సమసిపోయేలా చూస్తున్నారు. నేతల మధ్య ఉన్న పొరపొచ్చాలతో పార్టీ ఎదుగదలపై ప్రభావం చూపుతోంది. దీంతో పలు స్టేట్లలో పార్టీ వెనుకంజలో ఉండటానికి ప్రధాన కారణం విభేదాలే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న విభేదాల్ని నిర్మూలించేందుకు రాహుల్ గాంధీ ప్రధాన పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అయినా అన్ని నిర్ణయాలు మాత్రం రాహుల్ గాంధీ తీసుకుంటున్నారు.

ఒకవైపు మధ్యప్రదేశ్, రాజస్తాన్ లో కాంగ్రెస్ రాజకీయాలు అందరిని కలవరపెడుతున్నాయి. నేతల్లో అభిప్రాయ భేదాలు రావడంతో పార్టీ మనుగడపై ప్రభావం పడుతోంది. దీంతో రాహుల్ గాంధీ పార్టీని గాడిలో పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడడంతో పార్టీనేతల్లో నైరాశ్యం పెరుగుతోంది. దీని నివారణకు రాహుల్ గాంధీ నేతల్లో నూతనోత్తేజం నింపేందుకు కృషి చేస్తున్నారు. రాజస్తాన్ లో సచిన్ పైలెట్ కు సీఎం అశోక్ గెహ్లాట్ కు మధ్య పొసగపోవడంతో కాంగ్రెస్ కు నష్టమే జరుగుతోంది. దీనిపై కూడా రాహుల్ గాంధీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

పంజాబ్ లో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు నవజ్యోతి సింగ్ సిద్దూకు మధ్య కుదరడం లేదు. దీంతో ఇద్దరు ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. దీంతో నేతల్లో సఖ్యత కనిపించడం లేదు. ఈ ప్రభావం పార్టీపై పడుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చొరవ తీసుకుని సిద్దూను పీసీసీ అధ్యక్షుడిగా నియమించి పార్టీలో విభేదాలు లేకుండా చూడాలని సూచించారు. అమరీందర్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరించకూడదని చెప్పారు. రాష్ర్ట రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలనిి వారికి బలమైన సంకేతాలు ఇచ్చారు.

కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి. పార్టీ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. పీసీసీ అధ్యక్షుడు శివకుమార్ కు మాజీ మంత్రి సిద్ధ రామయ్యకు పడడం లేదు. దీంతో పార్టీ కార్యక్రమాలు సాగడం లేదు. దీనిపై ఇద్దరిని ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం లేదని తెగేసి చెప్పారు. ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని వారికి సూచించారు. ఇద్దరు సీఎం పదవిపై ఆశలు పెంచుకోవద్దని సూచించారు. మొత్తానికి రాహుల్ గాంధీ పార్టీని తన చేతుల్లోకి తీసుకుని కఠిన నిర్ణయాలు పెంచి నేతలను తమ వైపు తిప్పుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version