https://oktelugu.com/

దళితులకు న్యాయం చేసేందుకు కేసీఆర్ కొత్త ప్లాన్

తెలంగాణలోని దళితుల మీద పడ్డారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. అది సరిపోదని ఇంకా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాడు. ఎందుకంటే దళిత సామాజికవర్గానికి మద్దతుగా తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగి పదవులు, టీఆర్ఎస్ లోని ప్రాతినిధ్యాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి తెలంగాణ కేబినెట్ లో లేరు. మాలల నుంచి కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. అందుకే దళితులను […]

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2021 10:11 am
    Follow us on

    TS CM KCR

    తెలంగాణలోని దళితుల మీద పడ్డారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ‘దళితబంధు’కు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. అది సరిపోదని ఇంకా చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాడు. ఎందుకంటే దళిత సామాజికవర్గానికి మద్దతుగా తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగి పదవులు, టీఆర్ఎస్ లోని ప్రాతినిధ్యాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. మాదిగ సామాజికవర్గానికి చెందిన మంత్రి తెలంగాణ కేబినెట్ లో లేరు. మాలల నుంచి కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్నారు. అందుకే దళితులను ఆకట్టుకునేందుకు పథకాలే కాదు.. రాజకీయ ప్రాధాన్యానికి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    ఉప ఎన్నికల తేదీ వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా ఇద్దరు దళిత నేతలకు మంత్రి పదవులు ఇవ్వనున్నారని.. వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం కూడా ఇస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    మంత్రివర్గ విస్తరణలో ప్రస్తుతం ఈటల రాజేందర్ తొలగింపుతో ఒక ఖాళీ ఏర్పడింది. మరొకరిని తొలగించాలి.. అందుకే టీఆర్ఎస్ లో ఇప్పుడు ఏ మంత్రికి మూడుతుందోనన్న భయం వెంటాడుతోందట..

    దళితులను సంతృప్తిపరచడం.. వారి ఓట్లను టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా మాదిగ సామాజికవర్గాన్ని సంతృప్తిపరచాల్సిన అవసరం కేసీఆర్ కు ఉంది. ఇటీవల కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా దళితమంత్రులు ఇద్దరు ఉండాలని భావిస్తున్నాడట..రాజకీయంగా వారికి మంత్రి పదవులు ఇవ్వాలన్నది కేసీఆర్ నినాదం.. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్న కేసీఆర్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా దళిత ఎమ్మెల్యేను నియమించాలని చూస్తున్నాడు.

    ప్రతిపక్ష నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా, రేవంత్, బండి సంజయ్ లు దళిత ముఖ్యమంత్రిపై ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ దళితులకు రాజ్యాధికారం అనే అంశంపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది. దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి వీలైనంత వరకు దీన్ని చల్లార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా సమాచారం.

    తెలంగాణ ఏర్పాటైన కొత్తలో దళిత సామాజికవర్గానికి చెందిన రాజయ్యను డిప్యూటీ సీఎం చేశారు. ఆరోపణలతో తొలగించారు. ఆ తర్వాత కడియం శ్రీహరిని చేశారు. రెండోసారి ఆయనకు పదవిని ఇవ్వలేదు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలతో మళ్లీ దళిత కోటాలో ఇద్దరిని మంత్రులుగా చేయాలని.. వారి అసంతృప్తి చెలరేగకుండా చూడాలని కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.