టీకా ఉత్సవ్ పై రాహుల్ కౌంటర్..

దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారుతోంది. చాలా రాష్ట్రలో అంచనాకు అందని కేసులు రోజురోజుకు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఉధృతి ఉన్న రాష్ట్రల్లో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నిబంధనలు కఠినతరం చేయాలని దేశ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో గురువారం రాత్రి వీడియో […]

Written By: Srinivas, Updated On : April 9, 2021 2:06 pm
Follow us on


దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారుతోంది. చాలా రాష్ట్రలో అంచనాకు అందని కేసులు రోజురోజుకు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ఉధృతి ఉన్న రాష్ట్రల్లో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తుండగా.. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా నిబంధనలు కఠినతరం చేయాలని దేశ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలతో గురువారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. తగిన సూచనలు చేశారు.

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని చెప్పుకొచ్చిన ఆయన లాక్ డౌన్ లేకుండా వైరస్ ను కట్టడి చేయాలని సూచించారు. లాక్ డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని చెప్పిన మోదీ.. లాక్ డౌన్ ప్రసక్తి లేదని.. తప్పనిసరి పరిస్థితి ఎదురైతే.. రాత్రి కర్ఫ్యూ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలని సూచించారు. కరోనా నియంత్రణ విషయంలో ఆయా రాష్ట్రాల వైద్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని.. తీరు మార్చుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో వ్యాక్సినేషన్ ను విస్తృతం చేయాలని తెలిపారు. ఏప్రిల్ 11నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. అంటే ఈ నాలుగురోజుల పాటు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ వేడుకలా నిర్వహించాలని సూచించారు.

అయితే ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో చేసిన టీకా ఉత్సవ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ వైపు దేశంలో కరోనా టీకాల కొరత ఉంటే.. టీకా ఉత్సవ్ చేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంపై రాహుల్ పైర్ అయ్యారు. వ్యాక్సిన్ల కొరత అనేది తీవ్రంగా ఉందని.. అది ఇప్పుడు అతిపెద్ద సమస్యగా వివరించారు. ఇది వేడుక నిర్వహించాల్సిన సమయం కాదని.. ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చారు.

వైపు దేశంలో వ్యాక్సిన్ల కొరతతో వ్యాక్సిన్‌ కేంద్రాలు మూతపడుతుంటే మరోవైపు విదేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతులు ఏంటని.. రాహుల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుంటే, వ్యాక్సిన్ల కొరత కూడా అదే స్ధాయిలో పెరుగుతోందని రాహుల్‌ తెలిపారు. దేశ ప్రజల్ని రిస్క్ లో పెట్టి విదేశాలకు ఎగుమతి చేస్తారా అని రాహుల్‌ ప్రధాని మోడీని ప్రశ్నించారు. ఎలాంటి వివాదాలు లేకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్రం వ్యాక్సిన్‌ ఇవ్వాలని రాహుల్‌ సూచించారు. మనమంతా కలిసి ఈ మహమ్మారిని ఓడించాలని రాహుల్‌ పిలుపునిచ్చారు.