దీపావళికి స్థానిక ఉత్పత్తులనే కొనండి: మోడీ

దీపావళి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశాడు.దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకొనే ఈ దీపావళిని పురస్కరించుకుని ప్రజలందరూ స్థానిక ఉత్పత్తులను వాడాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ స్థానిక ఉత్పత్తులనే వాడాలని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దేశీయ ఉత్పత్తులను వాడటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ స్థానిక […]

Written By: Kusuma Aggunna, Updated On : November 13, 2020 4:40 pm
Follow us on

దీపావళి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశాడు.దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకొనే ఈ దీపావళిని పురస్కరించుకుని ప్రజలందరూ స్థానిక ఉత్పత్తులను వాడాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ స్థానిక ఉత్పత్తులనే వాడాలని గత కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దేశీయ ఉత్పత్తులను వాడటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ స్థానిక క ఉత్పత్తులను వాడుతూ, అందరిని చైతన్య పరచాలని తెలియజేశారు.

వారణాసిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా దేశీయ ఉత్పత్తులను కొనేందుకు వాటికి ఖరీదును ఖరారు చేయాలని దేశ ప్రజలను కోరారు. కేవలం దీపావళి పండుగ సందర్భంగానే కాకుండా మనదేశంలో వాడే ఉత్పత్తులైన, వస్తువులైన స్థానికంగా తయారు చేసినవి కొనడం ద్వారా మనదేశ గుర్తింపు పెరగడమే కాకుండా, వాటిని ఉత్పత్తి చేసే వారి కుటుంబాలు ఎంతో ఆర్థికంగా ఎదుగుతారని తెలియజేశారు.

దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులను వాడి, పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా మోడీ అభిప్రాయపడ్డారు.దీపావళి రోజున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేసి టపాకాయలు కాలుస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగకు ఉత్తరాది రాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. టపాకాయలు కాల్చేటప్పుడు వాతావరణ కాలుష్యం కలుగజేసే బాణాసంచాలు కాకుండా, గ్రీన్ క్రాకర్స్ ను కాల్చడం ద్వారా వాతావరణ కాలుష్యం కాకుండా మనం కాపాడుకోవచ్చు.కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పండుగను జరుపుకోవాలని సూచిస్తున్నారు.