Gaurav Gogoi's wife
Rahul Gandhi : గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) అనే పార్లమెంట్ సభ్యుడు( ఈయన డిప్యూటీ LoP గా కూడా ఉన్నారు) రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. ఆయన ఎలిజబెత్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె బ్రిటన్ పౌరురాలు. పాకిస్తాన్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో లీడ్ అనే పాకిస్తాన్ సంస్థకు ఆమె పని చేశారు. ISI తో ఆమెకు అనుబంధం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమంలోనే గౌరవ్ పార్లమెంట్లో కొన్ని ప్రశ్నలు అడిగాడు. అంతకుముందు ఆయన పాకిస్తాన్ దూతను కలిశాడు అని తెలుస్తోంది. “మనదేశంలో సరిహద్దు, తీరా ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? అక్కడ ఎంత స్థాయిలో భద్రతను మోహరించారు? సరిహద్దు పంచుకునే దేశాల నుంచి భద్రతను పెంపొందించేందుకు ఎటువంటి పరికరాలు వాడుతున్నారు? అటామిక్ ఎనర్జీలో భారత్ పరిస్థితి ఏంటి? న్యూక్లియర్ పరికరాలను ఎలా ఉపయోగిస్తున్నారు? మనదేశంలో యురేనియం ఎంత స్థాయిలో అందుబాటులో ఉంది? యురేనియం కోసం తవ్వకాలు ఏమైనా జరుపుతున్నారా” అని గౌరవ్ రక్షణ శాఖను పార్లమెంట్లో ప్రశ్నించారు.. అయితే ఎలిజబెత్ కు ISI తో సంబంధాలు ఉండడం, గతంలో గౌరవ్ పాకిస్తాన్ దూతను కలిసిన నేపథ్యంలోనే ఇలాంటి ప్రశ్నలు అడిగారని భారతీయ జనతా పార్టీ అనుమానిస్తోంది. గౌరవ్ అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో.. ఈ వ్యవహారంపై అసాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు.. గౌరవ్, ఎలిజబెత్ దేశద్రోహానికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని హిమంత అస్సాం పోలీసులను ఆదేశించారు. మరోవైపు ఈ వ్యవహారంపై అస్సాం ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ” భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న అతిపెద్ద కుట్రలో కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బహుశా బ్లాక్మెయిల్ లేదా ట్రాప్ కు గురయ్యారనుకుంటా . నేను కేవలం గౌరవ్ కోణంలో మాత్రమే చూడటం లేదు. ఈ వ్యవహారంలో భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర జరిగినట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఈ మొత్తం ఎకో సిస్టంలో గౌరవ్ అనే వ్యక్తి కేవలం పావు మాత్రమే. అతడు ఈ వ్యవహారంలో సూత్రధారి కాదు. ప్రస్తుతం అతడిని మేము జాలీతో మాత్రమే చూస్తున్నామని” అస్సాం ముఖ్యమంత్రి హిమంత వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఏమంటున్నదంటే
గౌరవ్, ఎలిజబెత్ కు పాక్ తో సంబంధాలున్నాయనే అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత రషీద్ అల్వి స్పందించారు..” అసలు హిమంత కు ఆధారాలు ఎవరు ఇచ్చారు. సమాచారం ఎవరు చెప్పారు.. ఒకవేళ నిజంగా ఆధారాలు గనక ఉంటే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు. దిగజారుడు రాజకీయాలను ఇప్పటికైనా అని నిలిపివేయాలి. ఇది ముమ్మాటికీ కుట్ర కోణంలో జరుగుతున్న వ్యవహారం. ప్రజల ముందు అభాసుపాలు చేయడానికి నిర్లజ్జగా ఆడుతున్న నాటకం. త్వరలో ఇదంతా బయటకు వస్తుంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారని” రషీద్ వ్యాఖ్యానించారు.. ఈ వ్యవహారంపై గౌరవ్ కూడా స్పందించారు..”అస్సాం ప్రజల జ్ఞానంపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏవో కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. అవన్నీ నిలబడవు. నిజం నిరూపించాలంటే ఆధారాలు కావాలి. ఆ ఆధారాలు ఆయనకు ఎవరు ఇచ్చారో తెలియదు? సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు?.. నిజంగా ఆధారాలు గనక ఉంటే ఎఫ్ఐఆర్ కచ్చితంగా నమోదు చేయాలి కదా.. అది జరగలేదంటే కుట్ర కోణం ఉన్నట్టే కదా అని” గౌరవ్ వ్యాఖ్యానించారు.