Rajinikanth and Ram charan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు చిరంజీవి (Chiranjeevi)…ఇండస్ట్రీ లో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని అహర్నిశలు కష్టపడి తనను తాను మెగా స్టార్ గా మార్చుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక సినిమా కోసం విపరీతంగా కష్టపడుతూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి ఒక స్టోరీ విన్న తర్వాత అది సక్సెస్ అవుతుందా? ఫెయిల్యూర్ అవుతుందా? అనే విషయాన్ని ముందే గెస్ చేస్తాడు. అందుకే ఆయనకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి…ఇక చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ (Ram Charan) సైతం చిరుత(Chirutha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక కెరియర్ మొదట్లో రామ్ చరణ్ కి సంబంధించిన కథలు మొత్తాన్ని చిరంజీవి వినేవాడు. ఆ కథలు చిరంజీవికి నచ్చితే అవి సెట్స్ మీదకి వెళ్ళేది. ఇక అలాంటి నేపథ్యంలో తమిళ్ స్టార్ హీరో అయిన రజినీకాంత్ (Rajinikanth) రామ్ చరణ్ కాంబో లో ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ అయితే లేకపోవడం వల్ల వీళ్ళిద్దరికీ ఆ కథ సెట్ అవ్వదనే ఉద్దేశ్యం తో చిరంజీవి ఆ సినిమాని రద్దు చేశాడు… ఆరెంజ్ (Oreng) సినిమా ప్లాప్ తర్వాత రామ్ చరణ్ బంగారం(Bangaram) మూవీ ఫేమ్ ధరణి (Dharani) అనే తమిళ్ డైరెక్టర్ తో ‘మెరుపు ‘ (Merupu) అనే సినిమాని స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా లో ఒక కీలకపాత్రలో రజనీకాంత్ కూడా నటిస్తాడనే వార్తలైతే వినిపించాయి.
కానీ ఓవర్ బడ్జెట్ కారణంగా ఈ సినిమాని చిరంజీవి నిలిపివేశాడు. అలాగే రజనీకాంత్ క్యారెక్టర్ కి కూడా అంత పెద్దగా ఇంపార్టెన్స్ అయితే లేదట. దానివల్ల ఆయనను తీసుకున్న పెద్దగా ప్రయోజనం లేదనే ఉద్దేశ్యంతో సినిమా క్యాన్సిల్ చేశాడు… ఇక ఆ తర్వాత ఆ డేట్స్ ని సంపత్ నంది కి ఇచ్చి రచ్చ (Rachha) అనే సినిమా చేయించాడు.
మరి ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా రామ్ చరణ్ కి మాస్ హీరోగా ఒక మంచి గుర్తింపుని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇలా రామ్ చరణ్, రజనీకాంత్ కాంబోలో రావాల్సిన సినిమాని చిరంజీవి నిలిపివేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
ఇది వర్కౌట్ అయితే ఒక క్రేజీ కాంబినేషన్ తేర మీదకి వచ్చేది. కానీ చిరంజీవి ఆ సినిమాను నిలిపివేయడమే మంచిదైంది అని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు. ఎందుకంటే ఆరెంజ్ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల భారీ డిజాస్టర్ గా మిగిలింది. దానికి తీవ్రమైన నష్టలైతే వచ్చాయి. ఇక ఈ సినిమా కూడా అలాంటి నష్టాలను మిగిలుస్తుందేమో అనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమాని నిలిపివేశారు…