https://oktelugu.com/

తనను ఎవరు కొట్టారో బయటపెట్టిన రఘురామ!

పాపం రఘురామ.. పోలీసులు తనను కొట్టారని చెప్పాడు కానీ.. ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఎక్కడ కొట్టారు? అన్నది మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పుకొచ్చి ఏకంగా తనను కొట్టినందుకు చట్టాలనే మార్చాలని గవర్నర్లకు లేఖలు రాయడం సంచలనమైంది.  ఏపీ సర్కార్ తో వివాదాన్ని రచ్చ చేయడానికి రఘురామ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఏపీలోనే ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన ఎంపీ ఎవరయ్యా అంటే ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.. ‘ఇంకెవరు మన రఘురామరాజే’ అంటారు. అంతలా […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 4:41 pm
    Follow us on

    పాపం రఘురామ.. పోలీసులు తనను కొట్టారని చెప్పాడు కానీ.. ఎవరు కొట్టారు? ఎందుకు కొట్టారు? ఎక్కడ కొట్టారు? అన్నది మాత్రం ఇప్పటిదాకా చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పుకొచ్చి ఏకంగా తనను కొట్టినందుకు చట్టాలనే మార్చాలని గవర్నర్లకు లేఖలు రాయడం సంచలనమైంది.  ఏపీ సర్కార్ తో వివాదాన్ని రచ్చ చేయడానికి రఘురామ రెడీ అయినట్టుగా తెలుస్తోంది.

    ఏపీలోనే ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన ఎంపీ ఎవరయ్యా అంటే ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.. ‘ఇంకెవరు మన రఘురామరాజే’ అంటారు. అంతలా ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను ఇబ్బంది పెడుతున్నాడు. విశేషం ఏంటంటే.. ఆయన వైసీపీ నుంచే గెలిచారు మరీ.. గెలిచిన పార్టీమీదనే యుద్ధం ప్రకటించారు. జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టుకెక్కాడు. ఇక వైసీపీ సర్కార్ పథకాలను కోర్టులో అడ్డుకుంటున్నాడు. అందుకే ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపినా కూడా ఎక్కడా తగ్గడం లేదు.

    సీఐడీతో ఇటీవల రాజద్రోహం కేసులో రఘురామను జైలుకు పంపింది ఏపీ సర్కార్. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన ఆరోపించారు. అయితే సిఐడీ అధికారులు తనను కొట్టిన అంశానికి సంబంధించి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదోక విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పరిణామాలను బట్టి తెలుస్తోంది.

    తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖ రాసిన ఎంపీ రఘురామ కృష్ణ రాజు… ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో లేఖ రాసినట్లు సమాచారం. సెక్షన్ 124ఏ రాజద్రోహం కేసును పూర్తిగా రద్దు చేసే విషయంపై సదస్సులో చర్చించాలని ఆయన కోరారు.

    రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలలో లోపాలు ఎత్తి చూపినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించిన విషయాన్ని గవర్నర్ల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ… ప్రజా సమస్యలు ప్రభుత్వానికి అర్థం అయ్యేలా చేస్తే… సీఎం జగన్ వ్యక్తిగత కక్ష పెంచుకుని అక్రమ కేసులు బనాయించేలా చేశారని లేఖలో ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర సీబీసీఐడి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. అక్రమంగా తనని అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించారని రఘురామ అందులో ప్రస్తావించారు. అరెస్టు చేసిన రోజే.. సీఐడీ కార్యాలయంలో అత్యంత క్రూరంగా హింసించారని.. సీఐడీ ఎడిజి సునీల్ కుమార్ నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు లాఠీలు, రబ్బరు బెల్టులతో చిత్రహింసలకు గురి చేశారని గవర్నర్ల దృష్టికి తీసుకువెళ్ళారు.

    స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఒక సిట్టింగ్ ఎంపీ పై దేశద్రోహం నేరం మోపడమే కాకా.. హింసించడం ఇదే తొలిసారి అని రఘురామ వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు రఘురామ పేర్కొన్నారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే సదస్సులో ఈ అంశాన్ని లెవనెత్తి.. తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.