హగ్ విషయంలో ఫీల్ అవుతోన్న ‘తమన్నా’ !

‘మిల్క్ బ్యూటీ తమన్నా’కి ఒక అలవాటు ఉంది. పొద్దున్నే లొకేషన్ కి వెళ్ళగానే అందరిని విష్ చేసే క్రమంలో గట్టిగా హగ్ చేసుకుంటుంది. అయితే ఇక పై తనకు ఆ హగ్ లు మిస్ అవుతాయి అని సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ తెగ ఫీల్ అయిపోయింది మిల్క్ బ్యూటీ. తమన్నా మాటల్లోనే ‘కరోనా రాకముందు నేను ఉదయాన్నే షూటింగ్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు అందరిని విష్ చేస్తూ.. ఆత్మీయంగా హగ్ చేసుకునేదాన్ని. ఆ టచింగ్ లో ఒక […]

Written By: admin, Updated On : June 9, 2021 4:59 pm
Follow us on

‘మిల్క్ బ్యూటీ తమన్నా’కి ఒక అలవాటు ఉంది. పొద్దున్నే లొకేషన్ కి వెళ్ళగానే అందరిని విష్ చేసే క్రమంలో గట్టిగా హగ్ చేసుకుంటుంది. అయితే ఇక పై తనకు ఆ హగ్ లు మిస్ అవుతాయి అని సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ తెగ ఫీల్ అయిపోయింది మిల్క్ బ్యూటీ. తమన్నా మాటల్లోనే ‘కరోనా రాకముందు నేను ఉదయాన్నే షూటింగ్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు అందరిని విష్ చేస్తూ.. ఆత్మీయంగా హగ్ చేసుకునేదాన్ని.

ఆ టచింగ్ లో ఒక ఫీల్ ఉంటుంది. మనస్ఫూర్తిగా అందర్నీ గట్టిగా హాగ్ చేసుకున్నప్పుడు నాలో ఎదో తెలియని బలం వచ్చేది. అందుకే, నా సినీ కెరీర్ లో నేను మార్నింగ్ లొకేషన్ సమయంలో విషెస్ ను ప్రత్యేకంగా చూస్తాను. కానీ, ఇక పై అలా చనువుగా అందర్నీ హాగ్ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. పైగా కెమెరా ముందు నటించేటప్పుడు మినహా మిగతా టైమ్ లో తప్పకుండా మాస్క్ ధరించాలి అంటే మనల్ని మనం దాచుకున్నట్టే లెక్క.

ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే.. ఇలాగే చాలా కాలం కంటిన్యూ అయ్యేలా ఉంది. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గేవరకు మునుపటిలా షూటింగ్ చెయ్యలేం అంటూ తమన్నా ఫీల్ అవుతుంది. ఇక గతేడాది ఈ మిల్క్ బ్యూటీకి కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా నుండి ఈ బ్యూటీ త్వరగానే కోలుకొంది అనుకోండి.

పైగా లాస్ట్ టైం కరోనా మొదటి వేవ్ ముగిసిన తర్వాత రెండు వెబ్ సిరీస్ షూటింగ్ లతో పాటు ఒక సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. ఇక ఈ సెకెండ్ వేవ్ ముగిసిన తరువాత ‘గుర్తుందా శీతాకాలం’, ‘సీటిమార్’, ‘మేస్ట్రో’ లాంటి మూడు చిత్రాల షూటింగ్స్ ను ఈ ముదురు భామ పూర్తి చెయ్యాల్సి ఉంది. అయితే, పాపం తమన్నాకి పెళ్లి కుదరడం లేదట. ఆమెకు తగ్గ వరుడు దొరకడం లేదట. ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులు వరుడు కోసం గాలిస్తున్నారు.