https://oktelugu.com/

అమెరికాలో ధనవంతులు.. ఇంత పిసినారులా?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తన పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్ల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా రికార్డులను సంపాదించి ఈ విషయాలు బయటకు తెచ్చినట్లు పేర్కొంది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొలుపుతాయి. అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్టమైందన్న […]

Written By:
  • NARESH
  • , Updated On : June 9, 2021 / 04:40 PM IST
    Follow us on

    ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో సంచలనంగా మారాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తన పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్ల ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా రికార్డులను సంపాదించి ఈ విషయాలు బయటకు తెచ్చినట్లు పేర్కొంది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొలుపుతాయి.

    అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్టమైందన్న వాదన వట్టిదేనని తేలిపోయిందని ప్రోపబ్లికా వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యంలో ప్రతి ఒక్కరూ తమవాటా పన్ను నిజాయతీగా చెల్లిస్తారని ప్రభుత్వ ఖజానాక పన్నుల రూపంలో కుబేరులు భారీ మొత్తంలో అందజేస్తారని ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని పేర్కొంది. ఈ సమాచారాన్ని ఇంకా ఎవరు అధికారికంగా ధ్రువీకరించలేదు.

    2007లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోన్ అప్పటికే మల్టీమిలీనియర్ గా ఉన్నప్పటికి ఒక్క డాలర్ కూడా ఆదాయ పన్ను కింద చెల్లించలేదు. 2011లో ఇదే పరిస్థితి. ప్రస్తుతం జెఫ్ బెజోన్ ప్రపంచంలోనే అత్యంత కుబేరుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక టెస్లా వ్యవస్థాపకుడు ప్రపంచంలో రెండో ధనవంతుడిగా ఉన్న ఎలన్ మస్క్ సైతం 2018లో ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదు. మైకేల్ బ్లూమ్ బెర్డ్ బిలియనీర్ ఇన్వెస్టర్ కార్ల్ ఇకాన్, జార్జ్ సోరోన్ సైతం పలు సార్లు ఒక్క డాలర్ ఆదాయపు పన్ను కూడా చెల్లించలేదు.

    అమెరికాలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 70 వేల డాలర్లు ఆర్జిస్తున్నారని ప్రోపబ్లికా తెలిపింది. దీంట్లో 14 శాతం పన్ను కింద చెల్లిస్తున్నారని పేర్కొంది. ఇక 6,28,300 డాలర్లకు పైగా ఆర్జించే దంపతులు గరిష్టంగా 37 శాతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని తెలిపింది. కానీ కుబేరులు మాత్రం ఈ వ్యవస్థన చాలా విజయవంతంగా కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది.