రఘురామ రాజకీయం: ఇక తెలంగాణకు..

వైసీపీ రెబల్ ఎంపీ రఘురాకృష్ణం రాజు రాజకీయం ఇక ఏపీ నుంచి తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. తెలంగాణలో అరెస్ట్ మొదలైన రాజకీయం ఏపీకి చేరి అక్కడ కోర్టుల చుట్టూ తిరిగి ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ తెలంగాణకు చేరింది. బెయిల్ తోపాటు చికిత్స కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంలో ఊరట లభించింది. తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజును గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా […]

Written By: NARESH, Updated On : May 17, 2021 9:43 pm
Follow us on

వైసీపీ రెబల్ ఎంపీ రఘురాకృష్ణం రాజు రాజకీయం ఇక ఏపీ నుంచి తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. తెలంగాణలో అరెస్ట్ మొదలైన రాజకీయం ఏపీకి చేరి అక్కడ కోర్టుల చుట్టూ తిరిగి ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆదేశాలతో మళ్లీ తెలంగాణకు చేరింది. బెయిల్ తోపాటు చికిత్స కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంలో ఊరట లభించింది.

తాజాగా ఎంపీ రఘురామకృష్ణంరాజును గుంటూరు నుంచి సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా వద్దకు పోలీసులు చేరుకొని ప్రత్యేక వాహనాలు సిద్ధం చేశారు. గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్ కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎస్ ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ కు ఈమెయిల్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయి.

రఘురామను రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.దీంతో రఘురామను ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ తీసుకొచ్చారు.

ఈనెల 21 వరకు ఎంపీ రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎస్ తెలంగాణ అధికారులతో చర్చించి రఘురామను తరలించి ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు చికిత్సలు చేయనున్నారు.