https://oktelugu.com/

మరో సంక్రాంతి సీజన్ కూడా పోయినట్టే?

కరోనా సెకండ్ వేవ్ తో మరోసారి సినిమాలు పోయినట్టే. ఇది రికవరీ కావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుంది. ఆ తర్వాత వచ్చేది దసరా సీజన్. కానీ దసరా సీజన్ వరకు కరోనా 3వ వేవ్ వస్తుందని అనుకుంటున్నారు. అదే జరిగితే దసరా, సంక్రాంతి సీజన్లు కూడా పోయినట్టే. ప్రస్తుతం జూన్ , జూలై వరకు కూడా కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయేలా లేదు. ఇఫ్పటికే షూటింగ్ లు ఆగిపోయిన సినిమాలన్నీ వచ్చే రెండు నెలల్లో మొదలు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2021 / 09:18 PM IST
    Follow us on

    కరోనా సెకండ్ వేవ్ తో మరోసారి సినిమాలు పోయినట్టే. ఇది రికవరీ కావడానికి కనీసం నాలుగైదు నెలలు పడుతుంది. ఆ తర్వాత వచ్చేది దసరా సీజన్. కానీ దసరా సీజన్ వరకు కరోనా 3వ వేవ్ వస్తుందని అనుకుంటున్నారు. అదే జరిగితే దసరా, సంక్రాంతి సీజన్లు కూడా పోయినట్టే.

    ప్రస్తుతం జూన్ , జూలై వరకు కూడా కరోనా సెకండ్ వేవ్ తగ్గిపోయేలా లేదు. ఇఫ్పటికే షూటింగ్ లు ఆగిపోయిన సినిమాలన్నీ వచ్చే రెండు నెలల్లో మొదలు పెట్టాలని యోచిస్తున్నారు.

    ఇక ప్రభుత్వాలు కూడా ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరిచే ఆలోచన చేయడం లేదు. చేసినా 50శాతం ఆక్యూపెన్సీ మించి ఇచ్చే యోచన లేదు. థర్డ్ వేవ్ రాకుండా డిసెంబర్ వరకు సినిమాలన్నీ మళ్లీ థియేటర్లో చూసే సూచనలు కనిపిస్తున్నాయి.

    దీన్ని బట్టి ఖచ్చితంగా అగ్రహీరోల సినిమాలు పవన్, మహేష్ బాబుది ఈ సంక్రాంతి రేసు నుంచి తప్పుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. చిన్న సినిమాలు కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతాయో లేదో చూడాలి మరీ.