
నటి సురేఖవాణి.. ఈ సీనియర్ నటీమణి అమ్మ, అక్క పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్ లో ఓ మంచి పాత్రధారిగా ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తనదైన శైలిలో అలరిస్తూనే ఉంటోంది.
ప్రస్తుతం సినిమాల షూటింగ్ లన్నీ కరోనాతో వాయిదాపడ్డాయి. కొత్త సినిమాలు విడుదల కావడం లేదు. దీంతో ఖాళీగా ఉన్న సురేఖ వాణి తన హాబీస్ ను సోషల్ మీడియాలో పంచుకుంటోంది.
తాజాగా సురేఖవాణి సోషల్ మీడియా కత్తిలాండి డ్రెస్ లు వేసుకుంటూ అలరిస్తోంది. కుర్ర హీరోయిన్లలో డ్రెస్ లతో ఆకట్టుకుంటోంది. అంతేకాదు.. తన కూతురుతోనూ వీడియోలు తీసి ఆకట్టుకుంటోంది.
నటి సురేఖవాణి తన కూతురుతో కలిసి ‘డ్రీమమ్.. వేకపమ్’ అంటూ స్పెప్పులేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
