https://oktelugu.com/

అనర్హత ఇక ఎండమావే..రఘురామ ఇక సేఫ్ నే..

ఏపీ ప్రభుత్వంపై తిరగబడ్డ ఎంపీ రఘురామకృష్ణం టాపిక్ ఎప్పటికీ హాట్ హాట్ గానే ఉంటందో. తాజాగా ఆయన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజగా ఇచ్చిన రూలింగ్ సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని, ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో రఘురామపై అనర్హత వేటు లేన్నట్లేనా..? అన్న చర్చ సాగుతోంది. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణం రాజు గత నెల రోజుల కింద వ్యతిరేక వ్యాఖ్యలు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 2, 2021 / 10:40 AM IST
    Follow us on

    ఏపీ ప్రభుత్వంపై తిరగబడ్డ ఎంపీ రఘురామకృష్ణం టాపిక్ ఎప్పటికీ హాట్ హాట్ గానే ఉంటందో. తాజాగా ఆయన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజగా ఇచ్చిన రూలింగ్ సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని, ఆ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో రఘురామపై అనర్హత వేటు లేన్నట్లేనా..? అన్న చర్చ సాగుతోంది.

    ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణం రాజు గత నెల రోజుల కింద వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో ఆయనను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాని ఎంపీ సుప్రీం కోర్టుకు వెళ్లడం ఆ తరువాత ఆయన ఆసుపత్రికి వెళ్లి అటునుంచి అటే ఢిల్లీకి పయనమవడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎంపీని ఏదో రకంగా అరెస్టు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి స్పీకర్ కు లేఖ రాశారు. అందులో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినట్లు తెలిపారు.

    అయితే పార్టీ ఫిరాయింపు విషయంలో తాము జోక్యం చేసుకోలేదని సుప్రీం తాజాగా రూలింగ్ ఇచ్చింది. పార్లమెంట్, అసెంబ్లీ అధికారాల్లో తాము చొరబడలేమని తెలిపింది. అయితే ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపులు చేసిన ఏ ఎమ్మెల్యే, ఎంపీలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలో అధికార పార్టీలోకి చేరడం ఆ తరువాత స్పీకర్ కూడా వారికి స్వాగతం పలకడం జరుగుతోంది.

    ఏపీలో టీడీపీ హయాంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ చేరారు. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అప్పటి స్పీకర్ కోడెల పట్టించుకోలేదు. తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చి టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు చేరినా వారికి స్వాగతం పలికారు గానీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎంపీ రఘురామరాజుపై చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి లేఖ రాశారు. అయితే ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా చట్టాలు మార్చుకుంటాయి.

    కాంగ్రెస్ హయాంలో పార్టీ పిరాయింపుల చట్టం తీసుకొచ్చింది. ఆ సమయంలో స్పీకర్ దే తుది నిర్ణయమని క్లాజ్ ఇచ్చింది. అయితే ఇప్పుడు దానిని బీజేపీ ఉపయోగించుకుంటోంది. అయితే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారే స్పీకర్ గా ఉంటున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయాన్ని పట్టించుకోవడం లేదు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధమైన అధికారాలతో ఉంటుంది. సభకు సంబంధించిన వరకు ఆయనే బాస్. కానీ ఇప్పుడు అలా జరగడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.