https://oktelugu.com/

ప్రేమను కాదందని.. ప్రేమోన్మాది ఘాతుకం

త‌న‌ను ప్రేమించ‌లేద‌ని దారుణానికి ఒడిగ‌ట్టాడో ఉన్మాది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి, ఏకంగా అమ్మాయి ఇంటికి వెళ్లి క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ సంఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నెల్లూరు జిల్లా గూడురు గ్రామానికి చెందిన సుధాక‌ర్ – స‌రిత దంప‌తుల కుమార్తె తేజ‌స్విని ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంది. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఉపాధ్యాయులు. వీళ్ల స‌హ‌చ‌ర ఉద్యోగి […]

Written By:
  • Rocky
  • , Updated On : July 2, 2021 / 10:32 AM IST
    Follow us on

    త‌న‌ను ప్రేమించ‌లేద‌ని దారుణానికి ఒడిగ‌ట్టాడో ఉన్మాది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి, ఏకంగా అమ్మాయి ఇంటికి వెళ్లి క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత తాను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ఈ సంఘ‌ట‌న నెల్లూరు జిల్లాలో జ‌రిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

    నెల్లూరు జిల్లా గూడురు గ్రామానికి చెందిన సుధాక‌ర్ – స‌రిత దంప‌తుల కుమార్తె తేజ‌స్విని ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంది. త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ ఉపాధ్యాయులు. వీళ్ల స‌హ‌చ‌ర ఉద్యోగి కుమారుడు వెంక‌టేష్ తేజ‌స్వినితో ప‌రిచయం పెంచుకున్నాడు. అది కాస్తా ప్రేమ‌గా మారింది. అయితే.. వెంక‌టేష్ ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో.. ఏడాది కాలంగా దూరంగా ఉంటోంద‌ట తేజ‌స్విని.

    ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో.. వెంక‌టేష్ ను అత‌ని తండ్రి కృష్ణ‌య్య బెంగ‌ళూరు పంపించాడు. అక్క‌డే ఉంటున్న వెంక‌టేష్‌.. క‌రోనా నేప‌థ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ఇంటికి వ‌చ్చేశాడు. అప్ప‌టి నుంచి తిరిగి తేజ‌స్విని వెంట ప‌డ‌డం మొద‌లు పెట్టాడు. త‌ర‌చూ ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడ‌ట‌. అత‌ని ఇబ్బంది ఎక్కువ కావ‌డంతో.. ఫోన్ నెంబ‌ర్ కూడా మార్చేసింది తేజ‌స్విని.

    దీంతో.. మ‌రింత కోపం పెంచుకున్న వెంక‌టేష్ ఆమెను చంపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. గురువారం ఉద‌యం అమ్మాయి త‌ల్లిదండ్రులు పాఠ‌శాల‌కు వెళ్లిన త‌ర్వాత‌.. స్నేహితుడితో క‌లిసి వాళ్ల ఇంటి వ‌ద్ద‌కు వెళ్లాడు వెంక‌టేష్‌. ముందుగా స్నేహితుడిని పంపి, ఫోన్ నంబ‌ర్ తెలుసుకొని రావాల‌న్నాడు. అత‌ను వెళ్లి త‌లుపు కొట్ట‌గా.. తేజ‌స్వి సోద‌రుడు తీశాడు. విష‌యం తెలుసుకున్న ఆమె సోద‌రుడు.. త‌న త‌ల్లిదండ్రుల‌కు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు.

    మ‌రింత ఆగ్ర‌హంతో ఊగిపోయిన వెంక‌టేష్‌.. వేగంగా ఇంట్లోకి దూసుకెళ్లి త‌లుపులు వేశాడు. ఆ త‌ర్వాత క‌త్తితో ఆమె గొంతులో పొడిచాడు. చున్నీ మెడ‌కు చుట్టి చంపేశాడు. ఆ త‌ర్వాత అదే చున్నీతో కిటికీకి ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు య‌త్నించాడు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ఇద్ద‌రినీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తేజ‌స్వి అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.