Raghuram krishnaraja vs Vijayasaireddy: సీబీఐకి విజయసాయి వర్సెస్ రఘురామ లేఖల వ్యవహారం?

Raghuram krishnaraja vs Vijayasaireddy: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రాజకీయ విద్వేషాలు రగులుతున్నాయి. ఇన్నాళ్లు కామ్ గా ఉన్నా ఇప్పుడు తెర మీద ట్రిక్కులు ప్లే చేస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రికవరీ చేయాలని రఘురామకృష్ణం రాజు వ్యవహారాలపై సీబీఐకు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. దీంతో రఘురామరాజుకు కోపం వచ్చి ఆయన కూడా విజయసాయిరెడ్డిపై లేఖ సంధించారు. దీంతో వ్యవహారం […]

Written By: Srinivas, Updated On : March 27, 2022 7:49 am
Follow us on

Raghuram krishnaraja vs Vijayasaireddy: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ రాజకీయ విద్వేషాలు రగులుతున్నాయి. ఇన్నాళ్లు కామ్ గా ఉన్నా ఇప్పుడు తెర మీద ట్రిక్కులు ప్లే చేస్తున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రికవరీ చేయాలని రఘురామకృష్ణం రాజు వ్యవహారాలపై సీబీఐకు విజయసాయిరెడ్డి లేఖ రాశారు. దీన్ని మీడియాకు విడుదల చేశారు. దీంతో రఘురామరాజుకు కోపం వచ్చి ఆయన కూడా విజయసాయిరెడ్డిపై లేఖ సంధించారు. దీంతో వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు లేఖల రాయబారం చేయడంతో పార్టీ పరువు పోతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Raghuram krishnaraja vs Vijayasaireddy

ఎంపీ లెటర్ ప్యాడ్ తనకేనా నాకూ ఉందని నిరూపించేందుకే ఈ పని చేశారని చెబుతున్నారు. కానీ ఆయన అప్పుల వ్యవహారం తీసుకుంటే ఈయన మాత్రం హత్యను ఎంచుకున్నారు. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డి మొదట వివేకాది గుండెపోటు అని చెప్పారని ఆయనను ప్రశ్నించి నిజానిజాలు తేల్చాలని సీబీఐ చీఫ్ కు లేఖ రాశారు. దీనిపై సీబీఐ చీఫ్ ఏం చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు.

Also Read: AP New Ministers: ఏపీ మంత్రివర్గ విస్తరణ డేట్ ఫిక్స్.. కొత్త మంత్రులెవరు?

కేసు విచారణలో ఉండటంతో రాజకీయాల కోసం వారు ఎన్ని ఫీట్లు చేసినా సీబీఐ మాత్రం తన పని తాను చేసుకుపోతోందని తెలుస్తోంది. ఇప్పటికే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లే. దీంతో వీరి ఆరోపణలకు అంత ప్రాధాన్యం ఉండదని సమాచారం. లేఖతో పాటు విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్లను కూడా జత చేసి అందరిని ఆశ్చర్యపరచారు. దీంతో వైసీపీ నేతల్లో సఖ్యత లేదనే విషయం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు

Raghuram krishnaraja vs Vijayasaireddy

ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడంతో సీబీఐ వారి వాదనలను తేలిగ్గానే తీసుకుంటోంది. వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఫిర్యాదులు చేసుకుంటూ మీడియాకు ఎక్కడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ వర్గాలను సైతం నివ్వెరపరుస్తోంది. విజయసాయిరెడ్డి ట్రిక్కులతో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఎలా స్పందిస్తారో అంతుచిక్కడం లేదు. రఘురామ మాత్రం వైసీపీని నిలువరించాలనే చూస్తున్నారు

Also Read: Telangana Jobs: తెలంగాణ జాబ్స్: మొత్తం తెలంగాణ సిలబస్ యేనా?

Tags