అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ఎంత అభాసుపాలు చేయాలని చూసినా.. ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని కుతంత్రాలు పన్నినా.. దుబ్బాక ఉప ఎన్నికలో చివరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలిచారు. ఇప్పటికే నాలుగైదు సార్లు ఓటమి పాలైన రఘనందన్‌రావుకు దుబ్బాక ప్రజలు ఎట్టకేలకు పట్టం కట్టారు. విజయతీరాన్ని చేరిన రఘునందన్‌రావు గెలిచిన తర్వాత మొదటి సారి తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సిద్దిపేటలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకున్నాక మీడియా ముందుకొచ్చారు.
Also Read: ఓటమికి కారణం అదే: టీఆర్‌ఎస్ ఓట్లు చీల్చింది ఆ ‘చపాతీ’
తన జీవితాన్ని దుబ్బాక ప్రజలకు అంకితం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో అరాచకపాలనకు దుబ్బాక ప్రజలిచ్చిన తీర్పు ప్రగతి భవన్‌కు వినిపించాలని అన్నారు. ఓ వ్యక్తిని.. కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులకు గురిచేయొచ్చు.. ఏ విధంగా అవహేళన చేయొచ్చనే వ్యవహార శైలికి ఈ తీర్పు కనువిప్పు కావాలన్నారు.
Also Read: టీఆర్‌ఎస్ వల్లే బీజేపీ గెలిచిందా..!
రాష్ట్రంలోని నియంతృత్వ, అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడాలని రఘునందన్ పిలుపునిచ్చారు. ఏ గడ్డపై చదువుకున్నానని సీఎం కేసీఆర్ చెప్పారో.. ఆగడ్డ రీసౌండ్ వినాలని వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఈ సందర్భంగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో సహకరించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామిలతోపాటు బూత్ స్థాయి కార్యకర్తలకూ రఘునందన్ ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఆకాంక్షించారని.. దుబ్బాక నుంచి డల్లాస్ వరకూ తన విజయాన్ని కోరుకున్నారని చెప్పారు. వారి ఆకాంక్ష,, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈ విజయం వరించిందని తెలిపారు.