Raghu Rama Krishnam Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇన్నాళ్లు వైసీపీలో ఉంటూ దాన్ని విమర్శిస్తుంటే చూసే వారికి ఎబ్బెట్టుగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతోనే పార్టీని వీడి వేరే పార్టీలో చేరాలనే యోచనలో పడిపోయారు. దీనికి సంబంధించిన చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే ఏ పార్టీలో చేరాలనేదానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. తనకు అనుకూలంగా ఉండే పార్టీనే ఎంచుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరాలా? బీజేపీలో చేరాలా అని తర్జనభర్జన పడుతున్నారు.

ఇన్నాళ్లు తన వెనకుండి నడిపించింది చంద్రబాబే అనే వాదనలు వస్తున్న నేపథ్యంలో రఘురామ బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరితే భవిష్యత్ కూడా బాగుండదని ఆలోచనలో ఆయన పడినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎక్కువగా మేలు చేకూరే అవకాశాలుండటంతో రఘురామ బీజేపీని ఎంచుకోనున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు కుదుర్చుకుంటే మరోమారు బీజేపీ తరుఫున పార్లమెంట్ కు ఎన్నిక కావచ్చని భావిస్తున్నారు. టీడీపీలో చేరితే ఒకవేళ ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కితే తనకు నష్టం జరిగే సూచనలున్నాయి. అందుకే బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Nara Bhuvaneswari: టీడీపీని గాడిలో పెట్టే పనిలో భువనేశ్వరి.. పార్టీ ఆలోచన ఇదేనా?
ఈ నేపథ్యంలో రఘురామ బీజేపీలో చేరితేనే ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అందుకే వైసీపీని వీడి బీజేపీలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం. అన్ని కలిసొస్తే త్వరలోనే ముహూర్తం చూసుకుని పార్టీ మారేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు వైసీపీలోనే ఉంటూ వారినే నిందించిన ఆయనకు మరో అవకాశంగా బీజేపీని ఎంచుకోనున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read: Janasena: విశాఖ ఉక్కు పరిరక్షణకు జనసేన మరో ఉద్యమం?