https://oktelugu.com/

Samantha: సమంత ఒంటరితనం అలా దూరం

Samantha: తప్పొప్పుల ప్రస్తావన అటుంచితే.. విడాకుల వ్యవహారం అత్యంత బాధించే అంశం. జీవితంలో పెళ్లి ప్రధాన ఘట్టం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తలెత్తితే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. మానసికంగా వెంటాడే ఎడబాటు ప్రశాంతతను దూరం చేస్తుంది. కొన్నాళ్లుగా టాలీవుడ్ క్రేజీ కపుల్ సమంత, నాగ చైతన్య ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మీడియాలో వార్తలు రావడానికి నెలల ముందే సమంత, చైతూ విడిపోయారు. వారి మధ్య మానసిక సంఘర్షణ మొదలైంది. ఇక వీరి విబేధాలు మీడియా దృష్టికి వచ్చాక […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 20, 2021 / 02:56 PM IST
    Follow us on

    Samantha: తప్పొప్పుల ప్రస్తావన అటుంచితే.. విడాకుల వ్యవహారం అత్యంత బాధించే అంశం. జీవితంలో పెళ్లి ప్రధాన ఘట్టం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తలెత్తితే జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. మానసికంగా వెంటాడే ఎడబాటు ప్రశాంతతను దూరం చేస్తుంది. కొన్నాళ్లుగా టాలీవుడ్ క్రేజీ కపుల్ సమంత, నాగ చైతన్య ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మీడియాలో వార్తలు రావడానికి నెలల ముందే సమంత, చైతూ విడిపోయారు. వారి మధ్య మానసిక సంఘర్షణ మొదలైంది.

    Samantha

    ఇక వీరి విబేధాలు మీడియా దృష్టికి వచ్చాక మరింత వేదనకు గురయ్యారు. నిరాధారమైన కథనాలు, వార్తలు ఇబ్బంది పెట్టాయి. ఒక ప్రక్క ప్రేమించిన వ్యక్తి దూరమైన బాధతో పాటు తప్పుడు కథనాలు మరింత కృంగదీశాయి. ఒత్తిడిలో, బాధలో ఉన్నప్పుడు స్నేహితుల తోడు అవసరం. సమంత అదే పని చేశారు. తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పారెడ్డి తో కలిసి వరుసగా టూర్స్ కి వెళ్లారు. వీలైనంత ఎక్కువ సమయం ఆమెతో గడపడానికి ప్రయత్నం చేశారు.

    శిల్పారెడ్డి కూడా సమంత పరిస్థితిని అర్థం చేసుకొని తోడుగా ఉన్నారు. నాగ చైతన్యతో సమంత విడిపోయి మనకు తెలిసి నాలుగు నెలలు అవుతుంది. అంతకు ముందు ఎప్పటి నుండి విడిగా ఉంటున్నారో మనకు తెలియదు. ఇక స్నేహితులు కూడా వెంటలేనప్పుడు సమంత ఒంటరితనం ఎలా దూరం చేసుకుంటుందో ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా అర్థమవుతుంది.

    ఇంట్లో ఒంటరిగా ఉంటే సమంత ప్రపంచం తన పెట్ డాగ్స్. చాలా కాలంగా సమంత యష్ పేరుతో ఓ పెట్ డాగ్ కలిగి ఉన్నారు. యష్ ని సమంత తన ఓన్ చైల్డ్ వలె భావిస్తారు. యష్ తో ఆడుకోవడం సమంతకు ఇష్టమైన వ్యాపకాలలో ఒకటి. ఈ మధ్య మరో డాగ్ ని కూడా ఆమె ఇంటికి తెచ్చారు. కాగా షూటింగ్ లేకపోతే సమంత ఆ రెండు పెట్ డాగ్స్ తో గడుపుతారు. వ్యాయామం ముగిసిన వెంటనే ఇక వాటితో మింగిల్ అయిపోతారు.

    Also Read: Sai Pallavi: సాయి పల్లవి… నువ్వు మరీ అంత సెన్సిటివ్ ఏంటమ్మా!

    అలా సమంత చైతూతో విడాకుల కారణంగా ఏర్పడిన ఒంటరితనాన్ని అధికగమిస్తున్నారు. ప్రస్తుతం సమంత తన కొత్త చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. అలాగే కొన్ని కొత్త చిత్రాలు, సిరీస్ల ప్రకటన చేయనున్నారు. సమంత డెబ్యూ ఐటెం నంబర్ ”ఊ అంటావా ఊఊ అంటావా” భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. పుష్ప మూవీలో ఈ సాంగ్ ప్రత్యేకంగా నిలిచింది.

    Also Read: Oo Antava Song: “ఊ అంటావా మావా” సాంగ్ పై స్పందించిన సమంత…

    Tags