Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి. చంద్రబాబు సతీమణిగానే తెలుసు. కానీ ఆమె ప్రత్యక్షంగా ఏనాడు రాజకీయాల్లోకి రాలేదు. పట్టించుకోలేదు. కానీ ఇటీవల తాను నేరుగా ప్రజలతో కలిసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల తిరుపతిలో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం అందించేందుకు ఆమె నేరుగా బాధితుల వద్దకు వచ్చారు. దీంతో రాజకీయాల్లో ఒకటే చర్చ. పతి, కుమారుడి కోసమే భువనేశ్వరి ప్రత్యక్షంగా వస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇన్నాళ్లు పార్టీ జవసత్వాలు లేని పార్టీగా నిర్లిప్తంగా ఉన్న తరుణంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎప్పుడు సాధారణ గృహిణిగానే ఉన్న ఆమె ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజల వద్దకు రావడంతో రాజకీయ వర్గాల్లో ఆలోచనలు పెరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీని విజయతీరాలకు చేర్చేందుకు భువనేశ్వరి తనవంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా పరిచయం అక్కరలేని భువనేశ్వరి ఇప్పుడు టీడీపీకి కొత్త రక్తం ఎక్కించాలని చూస్తున్నట్లు సమాచారం.
భర్త, కుమారుడు పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా వారి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. దీంతో ఆమె పార్టీని నడిపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతిలో బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష అందించి తన ఉదారత చాటుకున్నారు. దీంతో ప్రజల్లో మరింత పట్టు సాధించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: KCR on BJP : కేసీఆర్ సారు ఆదేశించడాలేనా..? పాటించడాల్లేవా??
ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు కన్నీరు కార్చడంతో భువనేశ్వరిలో కసి మరింత పెరిగిందని తెలుస్తోంది. తన భర్తను కంట తడి పెట్టించిన వారి అంతం చూడాలనే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇకనుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి పార్టీని మరింత ఎత్తుకు తీసుకెళ్లాలనేది ఆమె ఆలోచనగా చెబుతున్నారు. దీంతో టీడీపీకి జవసత్వాలు వచ్చినట్లేనా అని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Also Read: Employee Separation Process: ఉద్యోగుల విభజన.. ప్రభుత్వ నిర్ణయంతో తర్జనభర్జన