
భారత్ లోకి రఫేల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటికి క్రితమే వచ్చి చేరాయి. వీటిరాకతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. రఫేల్ యుద్ధవిమానాలు ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధవిమానాలుగా పేరుగాంచాయి. మన పొరుగుదేశమైన చైనా వద్ద కూడా ఇలాంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు లేవు. ఇది భారత్ కు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు భారత ఎయిర్ ఫోర్స్ లో సుఖోయ్ ఫైటర్ జెట్స్ మాత్రమే అత్యాధునికమైనవి. ప్రస్తుతం భారత్ కు చేరిన రఫెల్ యుద్ధ విమానాలు సుఖోయ్ ఫైటర్ జెట్స్ కు అడ్వాన్స్ వర్షన్. వీటి రాకతో భారత గగనతలం మరింత పటిష్టం కానుంది.
Also Read: పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?
భారతదేశానికి చైనా, పాకిస్థాన్ నుంచి ముంచి పొంచి ఉంది. పాకిస్థాన్ కంటే భారత్ ఆయుధ సంపత్తిలో చాలా మెరుగైన స్థితిలో ఉంది. పాకిస్థాన్ తో యుద్ధం వస్తే గెలుపు భారత్ దేనని ఆదేశానికి కూడా తెలుసు. అందుకే పాకిస్థాన్ నేరుగా యుద్ధం చేయకుండా దొడ్డిదారిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. పాకిస్థాన్ తోకజాడించిన ప్రతీసారి భారత్ గట్టిగానే ఆ దేశానికి బుద్ది చెబుతుంది. అయితే ఇటీవల చైనా నుంచి భారత్ కు సవాల్ ఎదురవుతోంది. చైనా దేశం భారత సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడుతూ భారత సైనికులను రెచ్చగొడుతోంది.
చైనా జవాన్లు భారత్ లోని గాల్వానాలోయలోకి చొచ్చుకురావడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా చైనా జవాన్లు సైతం ఎక్కువగా మృతిచెందారు. అయితే చైనా మృతుల వివరాలను వెల్లడించలేదు. ఈ విషయాన్ని కేంద్రం సీరియస్ తీసుకొని చైనాకు గట్టి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే చైనాను రక్షణ, ఆర్థిక, అంతర్జాతీయం దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. చైనాకు చెందిన వస్తువులను బ్యాన్ చేయడం, కాంట్రాక్టర్లు రద్దు చేయడం, అంతర్జాతీయంగా ఆ దేశంపై ఒత్తిడి చేయడం లాంటివి చేస్తోంది.
అయితే రక్షణ పరంగా చైనాను ఎదుర్కొనేందుకు పెద్దమొత్తంలో యుద్ధసామగ్రిని భారత్ సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఇందులో భాగంగా గత యూపీఏ హయాంలో ఆగిపోయిన రక్షణ ఒప్పందాలను మోడీ సర్కార్ పట్టాలెక్కించింది. ఫ్రాన్స్ దేశంతో రఫెల్ యుద్ధవిమానాలను కొనుగోలు గతంలోనే జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఆ దేశంతో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై చర్చించారు. వీటిలో భాగంగానే ఫ్రాన్స్ లో భారత్ కోసం తయారుచేసిన ఐదు రఫెల్ యుద్ధవిమానాలు తొలివిడుతలో నేడు భారత్ కు చేరాయి.
రఫేల్ యుద్ధ విమానాల ప్రత్యేక చూస్తే శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. రఫేల్ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటకుండా శత్రుదేశాలపై దాడి చేయగలవు. 60వేల అడుగుల ఎత్తులోనూ లక్ష్యాలను ఖచ్చితంగా చేధించగలవు. 60నుంచి 70కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ధ్వంసం చేయగలగడం ఈ యుద్ధ విమానాల ప్రత్యేకత. ధ్వని వేగం కంటే నాలుగు రెట్లు వేగంగా పయనించగలవు. రాడార్ మార్గనిర్దేశాలను అనుసరించి ఈ యుద్ధ విమానాలు పయనిస్తాయి. ఇందులోని స్కాల్ప్ క్షిపణి 600కిలోమీటర్ల దూరం నుంచి లక్ష్యాలను చేరుకోగలదు. ఒక రఫేల్ యుద్ధ విమానం బరువు 10 టన్నులు. నిమిషానికి 2500 రౌండ్లు పేల్చే శక్తి ఈ యుద్ధ విమానాలకు సొంతం.
Also Read: పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?
భారత పరిస్థితులకు అనుగుణంగా రఫేల్ యుద్ధ విమానాన్ని భారత్ తయారు చేయించింది. భారత పర్వత ప్రాంతాల్లో పోరాటానికి ఈ యుద్ధ విమానాలు ఎంతగానో ఉపయోగపడతాయి. రక్షణ శాఖ ఈ విమానాన్ని అనేక మిషన్లు చేపట్టే ఓమ్నిరోల్ విమానంగా భావిస్తోంది. దక్షిణ ఆసియాలోనే ఏవియానిక్స్, రాడార్లు, అత్యుత్తమ ఆయుధ వ్యవస్థ కలిగిన యుద్ధ విమానం రఫేల్ మాత్రమేనట. రఫేల్ యుద్ధ విమానంలో 10వేల500 టన్నుల పేలుడు పదార్థాలను ఒకేసారి తీసుకెళ్లవచ్చు. అణ్వాస్త్రాలను మోసుకొని వెళ్లగలడం దీనికి ఉన్న అదనపు ప్రత్యేకత.
నేడు భారత గగనతలంలోకి రఫేల్ యుద్ధ విమానాలు ఎంట్రీ ఇవ్వగా సుఖోయ్ యుద్ధ విమానాలు ఘన స్వాగతం పలికాయి. అంబాలా ఎయిర్ బేస్ లో రఫేల్ యుద్ధ విమానాలు సేఫ్ గా ల్యాండయ్యాయి. వీటిరాకతో గగతన గస్తీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు మరింత సులువు కానుంది. ఈ యుద్ధ సమయంలో వేగంగా స్పందించడంలో ఎయిర్ ఫోర్స్ దే కీలక పాత్ర. రఫేల్ యుద్ధ విమానాలను భారత్ గేమ్ ఛేంజర్ గా భావిస్తుంది. భారత్ అమ్ముల పొదిలోకి రఫేల్ యుద్ద విమానాలు చేరడంతో శత్రుదేశాలకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయంగా కన్పిస్తోంది.