Reverse: ఆనేత సంచలన కామెంట్స్.. ఆయనకే రివర్స్ గా మారాయా?

Reverse: ఇటీవలీ కాలంలో సోషల్ మీడియా ప్రభావం అన్నిరంగాల్లో బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజకీయ నేతలు, సినీ సెలబ్రెటీలకు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దీని వల్ల వారికి ఎంత ఉపయోగం ఉందో అంతే చెడు కూడా ఉన్నది అనేది మాత్రం వాస్తవం. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసే సంచలన కామెంట్స్ ఒక్కొసారి వారికి ఎంత క్రేజ్ తీసుకొస్తుందో.. రివర్స్ అయితే మాత్రం వారి ఇమేజ్ ను భారీగా […]

Written By: NARESH, Updated On : December 27, 2021 1:02 pm
Follow us on

Reverse: ఇటీవలీ కాలంలో సోషల్ మీడియా ప్రభావం అన్నిరంగాల్లో బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజకీయ నేతలు, సినీ సెలబ్రెటీలకు సోషల్ మీడియాను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. దీని వల్ల వారికి ఎంత ఉపయోగం ఉందో అంతే చెడు కూడా ఉన్నది అనేది మాత్రం వాస్తవం. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు మీడియా, సోషల్ మీడియా వేదికగా చేసే సంచలన కామెంట్స్ ఒక్కొసారి వారికి ఎంత క్రేజ్ తీసుకొస్తుందో.. రివర్స్ అయితే మాత్రం వారి ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేస్తాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Andhra Pradesh

తాజాగా తన హత్యకు కుట్ర జరిగిందని.. రెక్కీ సైతం నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటీ రాధా సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీలతో కలిసి వంగవీటి రాధా మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆయన వ్యాఖ్యలే ఆయనకే రివర్స్ కావడం గమనార్హం.

రాధా మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు.. నన్ను చంపాలని చూసినా భయపడను.. దేనికైనా సిద్ధం.. నేను ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటా.. వంగవీటి రంగా కీర్తి ఆశయాల సాధనే లక్ష్యం’ అంటూ కామెంట్లు చేశారు. అయితే తనను ఎవరు చంపాలనుకున్నారు? ఎందుకు చంపాలనుకున్నారు? ఎప్పుడు చంపాలకున్నారనే విషయాలను మాత్రం చెప్పలేదు. ఈ విషయాలను త్వరలోనే వెల్లడిస్తానంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

దీంతో నెటిజన్లు తమ సృజనాత్మకను వెలికీతీస్తూ రాధాకు కామెంట్లు చేస్తున్నారు. పలువురు పాజిటివ్ గా కామెంట్లు చేస్తుంటే మెజార్టీ మాత్రం రాధా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తుండటం విశేషం. ‘ఏం సారూ.. నిన్ను చంపే అవసరం.. ఎవరికి ఉంటుందో చెప్పరాదూ’.. ‘అయ్యా.. రెక్కీ ఎందుకు నిర్వహించారో.. ఎవరు నిర్వహించారో.. నీకైనా తెలుసా?’.. ‘సార్.. సంచలనం కావాలంటే.. ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా?’ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వ్యాఖ్యలే ఎక్కువగా వస్తుండటంతో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరికొందరైతే రాధాను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఆయనేమన్నా రాజకీయాల్లో దూసుకుపోతున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాధాకు ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? భూ వివాదాలు ఉన్నాయా? ఆయనేమన్న రాజకీయంగా సంచలన కామెంట్లు చేసి.. శత్రువులను పెంచుకుంటున్నారా? అంటూ సీబీఐ లెవల్లో ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. ఆయనకు సొంత పార్టీలో కంటే ప్రత్యర్థి పార్టీలోనే మిత్రులున్నారని అలాంటప్పుడు ఆయనపై ఎవరు రెక్కి నిర్వహిస్తారంటూ కన్ క్లూజన్ సైతం ఇస్తున్నారు. దీంతో రాధా చేసిన వ్యాఖ్యలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.