https://oktelugu.com/

Naga Shaurya Lakshya: ప్చ్..  ‘ఆర్ఆర్ఆర్’కు  ప్లాప్ సినిమా  పోటీనా ?  

Naga Shaurya Lakshya: ప్రాచీన క్రీడా నేపథ్యంలో  నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా  ‘లక్ష్య’.    నాగశౌర్య సరసన  కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాకి  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో శరత్ మరార్ ఈ సినిమాని నిర్మించారు.  ఐతే,   మంచి అంచనాలతో  థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  దీంతో నాలుగు వారాల‌కే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా రెడీ అయ్యింది. తెలుగు ఓటీటీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 12:58 pm
    Follow us on

    Naga Shaurya Lakshya: ప్రాచీన క్రీడా నేపథ్యంలో  నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా  ‘లక్ష్య’.    నాగశౌర్య సరసన  కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాకి  సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో శరత్ మరార్ ఈ సినిమాని నిర్మించారు.  ఐతే,   మంచి అంచనాలతో  థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 
    Naga Shaurya Lakshya

    Naga Shaurya Lakshya

    దీంతో నాలుగు వారాల‌కే ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు ఈ సినిమా రెడీ అయ్యింది. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో  జనవరి 7  నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.   కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా అయినా  మరి  ప్రేక్షకులను అలరిస్తోందా ? చూడాలి.  

    Also Read:<Jr Ntr: ఎన్టీఆర్​-కొరటాల కాంబో సినిమాలో హీరోయిన్​గా సామ్​?

    అయితే,   జనవరి 7వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఉంది.  మరి అదే రోజు  లక్ష్య చిత్రం  ఆహా వీడియో లో ప్రసారం కాబోతుంది. ఒకపక్క ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే.. అసలు లక్ష్యను ఇక ఎవరు చూస్తారు ?  మరి ఏ ధైర్యంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని  జనవరి 7వ తేదీన రిలీజ్ చేయడానికి పూనుకున్నారు. ఓటీటీలోనైనా రిలీజ్ సమయం కీలకం. 
    అసలుకే ఓటీటీలో ఇప్పుడు పోటీ ఎక్కువ అయింది.  ఈ  నేపథ్యంలో ఇలా  ఆర్ఆర్ఆర్ లాంటి జాతీయ సినిమా పైకి  పోటీకి పోతే నిలబడటం కష్టం. మరి రిలీజ్ డేట్ విషయంలో మార్పులు ఏమైనా చేస్తారేమో చూడాలి.  ఇక ఈ సినిమా విషయానికి వస్తే..   భిన్నమైన స్పోర్ట్స్ అండ్  ఎమోషనల్ డ్రామాగా  ఈ సినిమా వచ్చింది. 
    మంచి  ఎమోషనల్ గా సాగుతూ బాగానే ఎంటర్టైన్ చేస్తోంది.   గ్రిప్పింగ్ నరేషన్ , కథలోని  సహజత్వం   వంటి అంశాలు బాగున్నాయి.  కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో  ఈ సినిమా పూర్తిగా విఫలం అయింది. ఇక  ఈ చిత్రం లో జగపతి బాబు, సచిన్ ఖేదేకర్ లు కీలక పాత్రల్లో నటించారు. డిజిటల్ ప్రీమియర్ గా వస్తున్న ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్  రాబడుతుందో చూడాలి.   
    Tags