https://oktelugu.com/

Pushpa Box Office Collection: ‘పుష్ప’  10 రోజుల ఏపీ  తెలంగాణ  కలెక్షన్స్  

pushpa box office collection: ‘ఐకాన్ స్టార్’  ‘అల్లు అర్జున్’  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన   ‘పుష్ప- ది రైజ్’ సినిమా  అత్యంత ప్రతిష్టాత్మకంగా  పాన్ ఇండియా సినిమాగా  రిలీజ్ అయింది. అయితే,   ప్రేక్షకులను  మెప్పించే   కోణంలో నెగిటివ్   కామెంట్స్  వచ్చాయి.  రివ్యూస్ కూడా చాలా బ్యాడ్ గా వచ్చాయి.  ఓ దశలో సినిమా ప్లాప్ అనే టాక్ కూడా బాగా  వినిపించింది. ఇక  బాక్సాఫీసు వద్ద  ఈ సినిమా నిలబడటం కష్టమే అనుకున్నారు. అయితే, పుష్ప మాత్రం ఏపీ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 27, 2021 / 01:07 PM IST

    Pushpa

    Follow us on

    pushpa box office collection: ‘ఐకాన్ స్టార్’  ‘అల్లు అర్జున్’  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన   ‘పుష్ప- ది రైజ్’ సినిమా  అత్యంత ప్రతిష్టాత్మకంగా  పాన్ ఇండియా సినిమాగా  రిలీజ్ అయింది. అయితే,   ప్రేక్షకులను  మెప్పించే   కోణంలో నెగిటివ్   కామెంట్స్  వచ్చాయి.  రివ్యూస్ కూడా చాలా బ్యాడ్ గా వచ్చాయి.  ఓ దశలో సినిమా ప్లాప్ అనే టాక్ కూడా బాగా  వినిపించింది.

    pushpa box office collection:

    ఇక  బాక్సాఫీసు వద్ద  ఈ సినిమా నిలబడటం కష్టమే అనుకున్నారు. అయితే, పుష్ప మాత్రం ఏపీ తెలంగాణలో  కలెక్షన్ల వర్షం  కురిపిస్తుంది. ముఖ్యంగా నైజాంలో మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది.   కేవలం  10 రోజుల్లోనే  రికార్డుల మోత మోగిస్తోంది.  ఇప్పటికే వరల్డ్ వైడ్ గా చూసుకుంటే..  వందల  కోట్ల గ్రాస్ కలెక్షన్లను  రాబట్టి  బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేస్తోంది.

    Also Read: Jr Ntr: ఎన్టీఆర్​-కొరటాల కాంబో సినిమాలో హీరోయిన్​గా సామ్​?

    మరి పుష్ప 10 రోజుల  కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా  చూస్తే..  
    నైజాం   1.65   కోట్లు 

    సీడెడ్   70 లక్షలు
    ఇక  ‘గుంటూరు, కృష్ణా,  నెల్లూరు,   ఉత్తరాంధ్ర,  ఈస్ట్,  వెస్ట్’ కలుపుకుని మొత్తంగా   ఆంద్రలో  10వ  రోజుకు గానూ  పుష్ప  1.15  కోట్ల రూపాయల  షేర్ ని రాబట్టింది. 
    మొత్తం చూస్తే..   10వ రోజు గానూ  ఏపీ మరియు  తెలంగాణ  మొత్తం కలుపుకుని  :    3.5   కోట్లు కలెక్ట్ చేసింది.   
    అయితే, ఈ సినిమా అన్ని  భాషల వెర్షన్ లను  కలుపుకుని  మొత్తం  రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసుకుంది. బారి రేట్లకు బయ్యర్లకు అమ్మారు.  కాబట్టి.. బయ్యర్లు బాక్సాఫీస్ సేఫ్ అవ్వాలి అంటే..   మొత్తం ఈ సినిమా  రూ.146 కోట్లు కలెక్ట్ చేయాలి.  కానీ ఇప్పటి వరకు  111.35  కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.  ఈ లెక్కన ఈ చిత్రం  బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టమే.   మొత్తమ్మీద అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఇది నిరాశ పరిచే అంశమే. 

    Also Read: Akhil: అఖిల్ మేకోవర్ లుక్ చూస్తే షాక్​.. ఏజెంట్​ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో!

    Tags