Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలమైన నేత. అక్కడ తనకు ఎదురులేని విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. ప్రతిపక్షం లేకుండా చేసుకుని తిరుగులేని నాయకుడిగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమలో ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగి ప్రపంచ వ్యాప్తంగా ఆరోపణలు మూటగట్టుకున్నా తాను అనుకున్నది చేయడానికే ప్రాధాన్యం ఇస్తుంటాడు. ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు విశ్రమించడు. అలాంటి సాహసాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి.
ప్రపంచమే యుద్ధం అంటే భయపడుతున్న నేటి సమాజంలో పుతిన్ ఉక్రెయిన్ తో యుద్ధానికి సన్నద్ధం కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న దేశంపై పెద్ద పంజా అవసరమా అని అన్ని దేశాలు ప్రశ్నిస్తున్నా లెక్క చేయడం లేదు. ఉక్రెయిన్ చేసిన నేరం ఏంటి? అది చేసిన పాపం ఏమిటి? నాటో దేశాలతో సన్నిహితంగా మెలగడమే అది చేసిన నేరమా? అమెరికాతో స్నేహంగా మెలగడమే అది చేసిన పాపమా? దీనికి దానిపై యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏకాకిగా మిగులుతోందా?
అయినా పుతిన్ మాత్రం లెక్కపెట్టడం లేదు. అంతర్జాతీయంగా అమెరికా లాంటి అగ్రదేశాలను సైతం పట్టించుకోవడం లేదు. దేశంలో తనకు ఎదురు లేకుండా చేసుకున్నారు. తాను చేసిన చట్టాలను అందరు సమ్మతించాల్సిందే. లేకపోతే వారికి మనుగడ ఉండదు. వారి జీవితమే నాశనం అయిపోతుంది. అలాంటి నాయంత పాలన పుతిన్ సొంతం. అందుకే ఆయనకు ఎవరు ఎదురు వెళ్లరు.
రష్యాలో ఆయనకు అనుకూలంగా చట్టాలు చేయించుకున్నారు. అంతకుముందు అధ్యక్షుడి కాలం నాలుగేళ్లు ఉండగా ఆయన అధికారంలోకి వచ్చాక ఆరేళ్లు చేసి రెండు మార్లు అధ్యక్షుడిగా చక్రం తిప్పుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేసి తన ఆదేశాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉక్రెయిన్ పై దాడితో ఏకాకిగా మిగిలిన లెక్క చేయడం లేదు.
అమెరికా లాంటి అగ్రదేశం హెచ్చరికలు జారీ చేసినా సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తాను అనుకున్న లక్ష్యం మేరకు ఉక్రెయిన్ ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. దానిపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను సైతం పక్కన పెట్టేశారు. దీంతో పుతిన్ ఓ మోనార్క్ గా అభివర్ణిస్తున్నారు.
Also Read: సినీ పరిశ్రమపై జగన్ కు ఎందుకంత కోపం?