Power Star Pawan Kalyan Craze: ఏ హీరోకి లేని క్రేజ్ ఒక్క పవన్ కి మాత్రమే ఎలా సాధ్యం అయ్యింది ? ఏ హీరోకి లేని భక్తులు ఒక్క పవన్ కి మాత్రమే ఎలా పుట్టుకొచ్చారు ? అందుకే.. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పవర్ కి ప్రతిరూపం అయ్యాడు. పవన్ నడక, చూపు, మాట.. ఇలా ప్రతి కదలికలో ఒక ప్రత్యేక శైలి ఉంది. పవన కంటిలోని మెఱుపుకి ఓ ఆకర్షణ ఉంది. పవన్ కళ్యాణ్ స్వభావంలాగే, ఆయన పర్సనల్ లైఫ్, సినీ కెరీర్ అంతా ఓపెన్ బుకే.
దూరం నుండి చూసిన వాళ్ళు పవన్ కి తిక్క ఉంది అంటారు, ఆయనను అర్థం చేసుకున్న వాళ్ళు పవన్ మనసు స్వచ్ఛమైన వెన్న లాంటిది అంటారు. ఎవరు ఏమనుకున్నా పవన్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. సాయం చేయడం పవన్ స్వభావం, సేవ చేయడం పవన్ శ్వాసలోని ప్రధాన గుణం. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే.. తనను సాయం చేయమని వాళ్ళు అడగకపోయినా.. వాళ్లకు సాయం చేయడం పవన్ కి ఉన్న అలవాటు.
Also Read: ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు షాకిచ్చిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్
పవన్ లోని సేవా గుణానికి పరిమితులు పరిధులు లేవు. సినిమా ఇండస్ట్రీలో సహజంగా ప్రతి ఒక్కరికీ ఇగో కవచంలా ఉంటుంది అంటారు. కానీ పవన్ ముందు ఎవ్వరూ తమ ఇగో చూపించరు. ఏ సూపర్ స్టార్ అయినా, ఏ ఐకాన్ స్టార్ అయినా పవర్ స్టార్ తర్వాతే మేము అని అంతా పవన్ ముందు ఒదిగిపోతారు. కారణం.. పవన్ వ్యక్తిత్వమే. పవన్ కి నాటకాలు నచ్చవు. లేనిపోని ఆర్భాటాలు ఎక్కవు.
అందుకే.. పవన్ తో ఎవరైనా సహజంగానే ఉంటారు. ఏది ఏమైనా పవన్ ది విభిన్నమైన శైలి, పవన్ ప్రవర్తన వైవిధ్యమైన నైజం. అందుకే పవన్ ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడు. ఇక చాల సంవత్సరాల తరువాత పవన్ భీమ్లా నాయక్ తో బాక్సాఫీస్ కి తన పంజా రుచి చూపించాడు. ఈ సినిమా పవన్ అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంది.
భీమ్లా నాయక్ సినిమా పవన్ రేంజ్ ని, క్రేజ్ ని మరోసారి ఘనంగా గుర్తు చేసింది. సోషల్ మీడియాను షేక్ చేసింది. మిగిలిన స్టార్ హీరోల రికార్డును బద్దలు కొట్టింది. పవన్ కి ఇంకా నంబర్ వన్ రేంజ్ ఫాలోయింగ్ ఉందా అని ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అవుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రమే ఎందుకు ఇంత క్రేజ్ అని సినిమా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి పవన్ కి ఈ స్థాయి స్టార్ డమ్ రావడానికి కారణం పవన్ మంచితనమే. టాలెంట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. కానీ.. మంచితనం ఉన్న హీరోలు అరుదుగా ఉంటారు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ పేరు మొదటి పేరుగా ఉంటుంది. కాస్త పేరు వస్తేనో.. లేక కాస్త డబ్బు చేస్తేనో.. కింద స్థాయి వ్యక్తులను పురుగులను చూసినట్టు చూసే ఈ సమాజంలో పవన్ లా ఉండటం, పవన్ లా బ్రతడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే.. పవన్ క్రేజే కాదు, రేంజ్ కూడా వేరే. దాంతో సహజంగానే పవన్ సినిమాలకు ఉండే క్రేజ్ ఏ హీరో సినిమాకి ఉండదు.
Also Read: రికార్డులన్నీ బద్దలైపోవాలి.. భీమ్లానాయక్ మీద బండ్ల గణేశ్ కామెంట్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే