Purandeshwari : విశాఖలో పురందేశ్వరికి పక్కా

మరోవైపు జివిఎల్ నరసింహం టిడిపి బిజెపికి దగ్గర కావడాన్ని అడ్డుకున్నారు. టిడిపి తో పొత్తును వ్యతిరేకించిన నేతల్లో ఆయన ఒకరు. దీంతో చంద్రబాబు ఆయన సైడు చేస్తారని.. బిజెపి అగ్ర నేతలు పట్టుబడితే మాత్రం జివిఎల్ కు ప్రత్యామ్నాయంగా రాజమండ్రి చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Written By: Dharma, Updated On : March 4, 2024 9:25 am

Purandeshwari

Follow us on

Purandeshwari : తెలుగుదేశం పార్టీ కీలక ఎంపి స్థానాలను తన వద్ద ఉంచుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా విశాఖ పై ఫోకస్ పెట్టింది. పొత్తులో భాగంగా విశాఖ స్థానాన్ని తమకు విడిచి పెట్టాలని బిజెపి కోరుతోంది. అయితే ఇక్కడి నుంచి పోటీకి సిద్ధంగా బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీ భరత్ ఉన్నారు. ఆయన ప్రచారానికి సైతం సిద్ధపడుతున్నారు. కానీ పొత్తుల చిక్కులు తేలడం లేదు. బిజెపి ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పుడు శ్రీ భరత్ పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

గతంలో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా చాలాసార్లు విశాఖ సీటును గెలుచుకుంది ఆ పార్టీ. ఈసారి కూడా పొత్తులో విశాఖ సీటును కోరుతోంది. ఇక్కడ నుంచి పోటీకి సీనియర్ నాయకుడు జివిఎల్ నరసింహం సిద్ధంగా ఉన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విశాఖలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. జాతీయస్థాయిలో తనకున్న పలుకుబడితో టికెట్ తెచ్చుకునే పనిలో పడ్డారు. ఇటీవల వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్ కు తప్పకుండా టికెట్ లభిస్తుంది అన్న నమ్మకం ఉంది.

అయితే తెలుగుదేశం పార్టీ సైతం విశాఖ కోసం పట్టుబడుతోంది. విశాఖను వదులుకోమని.. శ్రీ భరత్ రంగంలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తులో భాగంగా విశాఖ స్థానాన్ని బిజెపికి కేటాయించినా.. అది తమ కుటుంబంలోనే ఉండాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని రంగంలోకి దించనన్నట్లు తెలుస్తోంది. గతంలో ఆమె విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ప్రత్యేకంగా అనచర గణం కూడా ఉంది. దీంతో కచ్చితంగా ఆమె గెలుస్తారని.. కేంద్ర మంత్రి అవుతారని అంచనాలు ఉన్నాయి. మరోవైపు జివిఎల్ నరసింహం టిడిపి బిజెపికి దగ్గర కావడాన్ని అడ్డుకున్నారు. టిడిపి తో పొత్తును వ్యతిరేకించిన నేతల్లో ఆయన ఒకరు. దీంతో చంద్రబాబు ఆయన సైడు చేస్తారని.. బిజెపి అగ్ర నేతలు పట్టుబడితే మాత్రం జివిఎల్ కు ప్రత్యామ్నాయంగా రాజమండ్రి చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.