
KCR- Punjab CM Mann: జాతీయ రాజకీయాల కోసం ఆరు నెలల క్రితం వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని దేశ సంచారం చేశారు. తనతో కలిసి వచ్చే పార్టీల కోసం దేశంలోని అన్ని ప్రాతీయ పార్టీల తలుపు తట్టారు. గడప తొక్కారు. కానీ ఎప్పుడు ఏపార్టీకి మద్దతు ఇస్తారో.. తన అవసరాల కోసం ఏ పార్టీని అయినా కేసీఆర్ తొక్కేస్తారని తెలిసిన నేతలు కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తమ రాష్ట్రానికి వస్తే సాదరంగా స్వాగతించారు మినహా కలిపి పనిచేద్దామని ప్రకటించలేదు. ఒక దశలో బీజేపీ వ్యతిరేక కూటమిలో కేసీఆర్ పేరు చేర్చడానికి కూడా ఇష్టపడలేదు విపక్ష పార్టీలు. ఈ తరుణంలో ఆయన సొంత పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలు మొదలు పెట్టారు.
లిక్కర్ స్కాం కలిపింది ఇద్దరినీ..
జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం శతవిధాలా ప్రయత్నించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో విఫలమయ్యారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అయితే కేసీఆర్‌ను అవినీతి ముఖ్యమంత్రిగా ప్రకటించారు. తెలంగాణలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. తాము అవినీతి పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. కానీ బీఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేసీఆర్ పంచన చేరారు. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కాం. కేసీఆర్‌పై బహిరంగ విమర్శలు చేసిన కేజ్రీవాల్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితతో కలిసి అక్రమ లిక్కర్ వ్యాపారానికి తెరలేపింది. ఈ విషయం వెలుగులోకి రావడం, ఈడీ, సీబీఐ విచారణ చేస్తుండడంతో ఆప్, బీఆర్‌ఎస్ కలిసే పరిస్థితి వచ్చింది. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు కూడా కేజ్రీవాతోపాటు, పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ కూడా వచ్చారు. ఇలా లిక్కర్ స్కాం పుణ్యాన బీఆర్‌ఎస్, ఆప్ మిత్ర పక్షాలుగా మారాయి.
పంజాబ్ రైతులకు పరిహారంతో..
ఇక కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు ఉద్యమం చేసిన పంజాబ్, హర్యాణా రైతుల్లో కొందమంది వివిధ కారణాలతో మృతిచెందారు. వారి మరణానికి కేంద్రమే కారణమని తెలంగాణ సీఎం ఆరోపించారు. ఈమేరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈక్రమంలో పంజాబ్ వెళ్లి తెలంగాణ ప్రజల సొమ్మును పంజాబ్ రైతు కుటుంబాలకు పరిహారంగా చెల్లించారు. ఇలా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బుట్టలో వేసుకున్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ముందు కూడా భగవంత్‌మాన్ తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఈ సమయంలో ఆయనకు ప్రగతిభవన్ ద్వారాలు తెరుచుకున్నాయి. కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తర్వాత తెలంగాణ సీఎంవో ఇద్దరు ముఖ్యమంత్రులు భవిష్యత్ రాజకీయాలపై చర్చించారని ప్రకటించింది. అయితే పంజాబ్ వెళ్లిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న ¿¶ గవంత్‌మాన్ ఈ ప్రకటనను ఖండించారు. కానీ తాజాగా పంజాబ్ సీఎం తెలంగాణ పర్యటనకు వచ్చారు.
ట్రాప్‌లో పడ్డారా..
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అదే పనిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇటీవల రెండు సార్లు పర్యటించిన ఆయన మరోసారి .. తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణ సచివాలయం ప్రారంభం వాయిదా పడింది. అయినప్పటికీ తన టూర్‌ను పంజాబ్ సీఎం వాయిదా వేసుకోలేదు. తెలంగాణలో అభివృద్ధి చూడాలని ఆయన డిసైడయ్యారు. ఆయనకు కేసీఆర్ స్వయంగా తెలంగాణలో తాను చేసిన అభివృద్ధిని చూపించబోతున్నారు. సిద్దిపేట జిల్లాకు సీఎం కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌ను తీసుకెళ్లనున్నారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను చూపిస్తారు. పలు గ్రామాలతోపాటు కూడవెల్లి వాగు చెక్ డ్యామ్‌ను చూపించిం తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో వివరిస్తారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా అవతరించినప్పటి నుంచి భగవంత్ మాన్ కేసీఆర్‌తో పలుమార్లు భేటీ అయ్యారు. గత నెలలో ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్ బహిరంగ సభకు కూడా హాజరయ్యారు. తెలంగాణలోని కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శమని ప్రశంసలు కురిపించారు. పంజాబ్‌లో కూడా కంటి వెలుగు తరహాలో పథకం ప్రారంభిస్తామని అన్నారు.

భగవంత్ మాన్ ఆప్ పార్టీకి చెందిన వారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాలనపై దేశమొత్తం విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆయితే మాన్ మాత్రం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ అభివృద్ధికి ఫిదా కావడం అనుమానాలకు తావిస్తోంది. ఆయన పూర్తిగా కేసీఆర్ ట్రాప్‌లో పడ్డారని ప్రచారం జరుగుతోంది. తనకు కలిసి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో దిట్ట అయిన కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌నే తెలంగాణ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా దేశానికి పరిచయం చేయాలని భావిస్తున్నారు. ఇది ఆప్ నేతలనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో పంజాబ్‌లోని ఆప్ సర్కార్ పూర్తిగా బీఆర్‌ఎస్‌లో చేరి… బీఆర్‌ఎస్ సర్కార్ ఏర్పాటు చేసినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని రాజకీయ పండితులు భావిస్తున్నారు.