Punch Prabhakar: ఏపీ హైకోర్టు తీర్పులు, అవి ఇచ్చిన జడ్డీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతి పరుడు పంచ్ ప్రభాకర్ స్విజ్జర్లాండ్‌లో ప్రత్యక్షమయ్యాడు. దావోస్‌లో దర్జాగా తిరుగుతున్నాడు. ప్రపంచ వాణిజ్య సమావేశానికి వచ్చాడు. పంచ్ ప్రభాకర్ అరెస్ట్ చేయాలని హైకోర్టు సీబీఐకి పలుమార్లు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. దీంతో ప్రభాకర్ వైసీపీ నేతలతో కలిసి బహిరంగంగానే తిరుగుతున్నాడు.
దావోస్‌లో ప్రత్యక్షం..
పంచ్ ప్రభాకర్ ఇప్పుడు దావోస్‌లో దర్శనిమిస్తున్నాడు. అతనిపై సీబీఐ అరెస్టు వారెంటు ఉన్నప్పటికీ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో దర్శనమిచ్చాడు. వైసీపీ నేతలతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు. వైసీపీ నేతల అండతోనే, వారి పిలుపుతోనే ఆయన దావోస్ వెళ్లినట్లు తెలుస్తోంది. సీబీఐ.. ప్రభాకర్ ను అరెస్టు చేసేందుకు సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇందులో ఆలస్యమవుతోందని కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు లుకౌట్ నోటీసులు జారీ చేసి వెంటనే ప్రభాకర్‌ను అరెస్టు చేయాల్సిందిగా పలుమార్లు ఆదేశించింది. అయినా సీబీఐ మాత్రం ఇప్పటికీ అవే కారణాలతో చెబుతోంది.
Also Read: Captain Abhilasha Barak: యుద్ధరంగంలోకి తొలి మహిళా పైలెట్.. చరిత్ర సృష్టించిన అభిలాష
వైసీపీ అండ ?
పంచ్ ప్రభాకర్ కోసం సీబీఐ అరెస్టు వారెంట్‌తో గాలిస్తుంటే అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు మాత్రం ఫొటోలు తీసుకుంటూ బహిరంగంగానే దర్శనమిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి పంచ్ ప్రభాకర్ ను అప్పగించే అవకాశం ఉన్నా లెక్కచేయకుండా దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై బహిరంగ దర్శనాలతో వైసీపీ ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ హాజరైన సదస్సుకు ప్రభాకర్ ఎలా వచ్చారన్నదానిపై ఎవరూ నోరు మెదపడం లేదు. సీబీఐ కూడా ఆ దిశగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. కోర్టు ఈ ఫొటోలను సుమోటోగా తీసుకుంటే మాత్రం వైసీపీ నేతలకు చిక్కులు తప్పవు.
Also Read:Japan Man Turn Into Dog: కుక్కగా మారిన జపాన్ వ్యక్తి.. ఏకంగా రూ. 12 లక్షల ఖర్చు