RRR can’t Hit DJ Tillu Record: దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తర్వాత ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో తీసిన బిగ్గెస్ట్ మల్టీస్టార్ర్ర్ చిత్రం #RRR దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల అయ్యి ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా ఏకంగా బాహుబలి పార్ట్ 2 కలెక్షన్స్ ని దాటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇంతతి సంచలన విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రేర్ రికార్డ్స్ ని బ్రేక్ చెయ్యడం లో విఫలం అయ్యింది..ముందుగా ఈ సినిమా నందమూరి బాలకృష్ణ అఖండ 50 రోజుల సెంటర్స్ రికార్డు ని అందుకోవడం లో ఫెయల్ అయ్యింది..అఖండ సినిమా 100 కేంద్రాలలో 50 రోజులకు పైగా రన్ అవ్వగా, #RRR చిత్రం కేవలం 38 కేంద్రాలలో మాత్రమే 50 రోజులు నడిచింది..ఇక లాభాల విషయం లోకి వస్తే ఈ సినిమా DJ టిల్లు రికార్డు ని అందుకోవడం లో విఫలం అయ్యింది అని ట్రేడ్ పండితులు చెప్తున్నా మాట.

అసలు విషయానికి వస్తే DJ టిల్లు సినిమా ని ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ కేవలం 3 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించాడు..ఇక అన్ని ప్రాంతాలకు ఈ సినిమాని 6 కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మాడు..మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని మరియు 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది..అంటే ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కి మూడింతలు లాభాలు తెచ్చిపెట్టింది అన్నమాట ఈ సినిమా..ఇటీవల కాలం లో డిస్ట్రిబ్యూటర్స్ కి ఈ స్థాయి లాభాలు తెచ్చిపెట్టిన సినిమానే లేదు అట..రాజమౌళి 300 కోట్ల రూపాయలతో #RRR సినిమాని తీస్తే , అది విడుదలకి ముందు దాదాపుగా అన్ని ప్రాంతాలకు కలిపి 500 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
Also Read: Producer M. Ramakrishna Reddy: విషాదం : ప్రముఖ నిర్మాత కన్నుమూత !
ఇక విడుదల అయినా తర్వాత ఈ సినిమా 600 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని అన్ని ప్రాంతాలకు కలిపి వసూలు చేసింది..అంతే కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఈ సినిమా వంద కోట్ల రూపాయిల షేర్ ని లాభాల రూపం లో తెచ్చిపెట్టింది అట..అదే DJ టిల్లు 6 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఫుల్ రన్ లో 18 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి మూడింతలు లాభాల్ని ఆర్జించింది అన్నమాట..ఈ విధంగా లాభాల విషయం లో #RRR కూడా DJ టిల్లు తర్వాతే అని ట్రేడ్ పండితుల అభిప్రాయం.

Also Read: Khushbu Sundar: ఎవరండీ ఈ కొత్త బ్యూటీ..? సీనియర్ హీరోయిన్ షాకింగ్ లుక్ !
Recommended videos


