Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Copying Titles: తన సినిమా టైటిల్ ని తానే కాపీ కొడుతున్న మహేష్...

Mahesh Babu Copying Titles: తన సినిమా టైటిల్ ని తానే కాపీ కొడుతున్న మహేష్ బాబు

Mahesh Babu Copying Titles: మహేష్ బాబు ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఆయన హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అని అనిపించింది..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి..బాక్స్ ఆఫీస్ పరంగా ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ, కంటెంట్ పరంగా సూపర్ అని అనిపించుకున్నాయి..థియేటర్స్ లో పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ బుల్లితెర మీద మాత్రం సూపర్ హిట్ గా నిలిచాయి ఈ రెండు చిత్రాలు..ఇప్పుడు చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రాబోతుండడంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా పై అప్పుడే ట్రేడ్ లో అంచనాలు ప్రారంభం అయ్యాయి.

Mahesh Babu Copying Titles
Vamsi, Trivikram, Mahesh, Thaman

ఇది ఇలా ఉండగా మే 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు అనే సంగతి మన అందరికి తెలిసిందే..కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది మహేష్ బాబు తన కొత్త సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా టీజర్ ని విడుదల చెయ్యడం ఆనవాయితిగా చేస్తున్నాడు..ఈ ఏడాది కూడా ఆయన త్రివిక్రమ్ తో చెయ్యబోతున్న సినిమా కి సంబంధించిన టైటిల్ ని ప్రకటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి..సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి జరుగుతున్నా ప్రచారం ప్రకారం చూస్తూ ఉంటె, ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ని మూవీ యూనిట్ ఖారారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..గతం లో మహేష్ బాబు మరియు గుణ శేఖర్ కాంబినేషన్ లో ‘అర్జున్’ అనే సినిమా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది..కానీ ఇప్పుడు మళ్ళీ అదే సినిమా టైటిల్ ని పెట్టబోతున్నారు అనే వార్తలు రావడం తో మహేష్ బాబు ఫాన్స్ లో కాస్త కలవరం మొదలైంది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రావాలి అంటే మరో 5 రోజులు వేచి చూడాల్సిందే.

Mahesh Babu Copying Titles
Arjun

Also Read: Congress’ One Family, One Ticket: ఒకే కుటుంబం.. ఒకే టికెట్‌… కాంగ్రెస్‌లో క్వాలిఫికేషన్‌ కష్టాలు..!!

ఇది ఇలా ఉండగా మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు అనే సంగతి మన అందరికి తెలిసిందే..త్రివిక్రమ్ తో ప్రస్తుతం ఆయన చెయ్యబోతున్న సినిమా పూర్తి అయినా వెంటనే రాజమౌళి తో చేయనున్నాడు..ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పనిలో ప్రస్తుతం బిజీ గా ఉన్నాడు రాజమౌళి..అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమాకి సంబంధించిన వివరాలు కూడా ఈ నెల 31 వ తారీఖున రాజమౌళి తెలియచెయ్యబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది..అలా మహేష్ బాబు అభిమానులకు ఒక్కే రోజు డబుల్ ధమాకా అన్నమాట..మహేష్ బాబు అభిమానులకు ఈ రెండు సినిమాలు ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు..వాళ్ళ హీరో ని వేరే లెవెల్ కి తీసుకొని వెళ్లే సినిమాలుగా ఈ రెండు సినిమాలు నిలుస్తాయి అని గట్టిగ నమ్ముతున్నారు..భరత్ అనే నేను నుండి వరుసగా హిట్స్ వస్తున్నప్పటికీ కూడా, అవి ఎందుకో మహేష్ బాబు రేంజ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లే సినిమాలు గా నిలబడలేదు..కానీ ఈ రెండు సినిమాలు మాత్రం తమ హీరో ని వేరే లెవెల్ కి కచ్చితం గా తీసుకెళ్తుంది అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు..చూడాలి మరి వారి నమ్మకాలను ఈ సినిమాలు ఎంత వరుకు నిలబెడుతుందో.

Mahesh Babu Copying Titles
Mahesh SSR Movie

Also Read: Captain Abhilasha Barak: యుద్ధరంగంలోకి తొలి మహిళా పైలెట్‌.. చరిత్ర సృష్టించిన అభిలాష
Recommended videos
బొత్స కు రాయపాటి అరుణ కౌంటర్ || Rayapati Aruna Strong Counter to Botsa Satyanarayana || Janasena
బాలకృష్ణ మాస్ వార్నింగ్ || Balakrishna Mass Warning to CM Jagan || Ok Telugu
ప్రతి బీసీ చూడాల్సిన వీడియో || Common Man Comments on AP Rajya Sabha Seats for Telangana Leader

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version