Homeఆంధ్రప్రదేశ్‌తెలుగు చానళ్ళ పై ప్రేక్షకుల స్పందన ఎలా వుందో చూడండి

తెలుగు చానళ్ళ పై ప్రేక్షకుల స్పందన ఎలా వుందో చూడండి

తెలుగు చానళ్ళ పై  ప్రజల స్పందన  ఎలావుందో ఇంతకుముందు మన కాలమ్స్ లో ఇవ్వటం జరిగింది. ఆ రేటింగ్స్ హైదరాబాద్ నగరానికి సంబంధించినవి. బార్క్ వారం వారం ప్రేక్షకుల స్పందనపై దేశ వ్యాప్తంగా మరియు భాషాపరంగా ప్రాంతాలవారీగా ఈ సమాచారాన్ని అందచేస్తుంది. ఇది నాలుగైదు వర్గీకరణలుగా వుంటుంది. ఇందులో గ్రామీణ , పట్టణ, మెట్రోల వర్గీకరణ తో పాటు మొత్తం ప్రేక్షకుల స్పందన ఎలా వుందో ఇస్తారు. ఇది వారం వారం వారం మారుతూ వుంటుంది. అయితే వరుస వారాల్లో పెద్ద మార్పులేమీ రావు. కొన్ని నెలల్లో మాత్రం మార్పులు స్పష్టంగా వుంటాయి. మనం సేకరించినవి ఏప్రిల్ 18 నుంచి 24 వారానికి సంబంధించినవి. ఇవి హైదరాబాద్ నగరానికి మొత్తం ఆంధ్ర, తెలంగాణ కి స్పష్టమైన తేడా కనబడుతుంది.

ఆంధ్ర, తెలంగాణ మొత్తం మార్కెట్ ఎలావుందో చూస్తే ఈ కింది చానళ్ళు మొదటి పది స్థానాల్లో వరుసగా నిలిచాయి.

మొత్తం                         హైదరాబాద్

  1.  TV 9                           TV 9
  2. V 6                               V 6
  3. NTV                            T News
  4. TV 5                             NTV
  5. Sakshi                         TV 5
  6. T News                        HM TV
  7. 10 TV                           ETV Telangana
  8. I News                          Sakshi
  9. ETV AP                        10 TV
  10. ABN                              ABN

మిగతా పట్టణ , గ్రామీణ వర్గీకరణల్లో చెప్పుకోదగ్గ మార్పుల్లేవు.ఈ రేటింగ్స్ పై మరింత వివరణ చూద్దాం.

  • TV 9  అన్ని వర్గీకరణల్లో , అలాగే మొత్తం ప్రేక్షకుల్లో మొదటి స్థానం లో ఉండటమే కాకుండా మిగతా చానళ్ళకు అందనంత దూరం లో వుంది. ఒక్క హైదరాబాద్ లో మాత్రం రెండో స్థానం లో వున్న V 6 గౌరవప్రదమైన పోటీలో వుంది.
  • కొత్తగా పెట్టిన V 6 ఆశ్చర్యంగా హైదరాబాద్ తో పాటు మొత్తం రేటింగ్స్ లో కూడా రెండో స్థానం లో కొనసాగుతుంది.
  • 3 , 4 స్థానాలు వర్గీకరణ బట్టి మారుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో T News మూడో స్థానం లో వున్నా మొత్తం మీద చూస్తే ఆ స్థానం NTV భర్తీ చేసింది. అదే TV 5 మొత్తం మార్కెట్ లో నాలుగో స్థానం భర్తీ చేస్తే ఎక్కువమంది ప్రేక్షకులుండే హైదరాబాద్ లో ఐదో స్థానానికి పడిపోయింది. ఒక్క గ్రామీణ ప్రాంతంలోనే TV 5 రెండో స్థానం లో వుంది. కానీ గ్రామీణ విభాగం లో ప్రేక్షకుల సంఖ్య బాగా తక్కువ వుంటుంది.
  • సాక్షి మొత్తం మీద ఐదో స్థానం తో సరిపెట్టుకుంటే హైదరాబాద్ లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
  • ABN ఆంధ్ర జ్యోతి ఎక్కడా గౌరవప్రద స్థానంలో లేదు. దాదాపు అన్ని వర్గీకరణల్లో 10 వ స్థానం, ఆ క్రింద నే వుంది. వేమూరి రాధాకృష్ణ ఛానల్ రంగం లో విఫలమైనట్లే చెప్పాలి.
  • ఇక ETV విషయానికొస్తే ఇదీ విఫలమైనట్లే చెప్పాల్సి వుంటుంది. దీనికి సంబంధించిన రెండు ( AP, తెలంగాణ ) చానళ్ళు మొదటి అయిదు స్థానాల్లో ఏ వర్గీకరణల్లో లేవు. పత్రికారంగం లో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు తెలుగు TV చానళ్ళ విషయం లో వెనకబడి పోయాడు. మొత్తం మీద చూస్తే ETV AP 9 వ స్థానం లో వుంటే తెలంగాణ ఛానల్ 12 వ స్థానం లో వుంది. హైదరాబాద్ లో అయితే తెలంగాణ ఛానల్ 7 వ స్థానం లో, AP ఛానల్ 11 వ స్థానం లో వున్నాయి.
  • మొదటి 7 , 8  స్థానాల్లో నిలిచి 10 TV, I News  భవిష్యత్తుపై ఆశలు పెంచుకో గలిగాయి.

కొన్నాళ్ళు ఈ రేటింగ్స్ సరళి లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. ఈ రేటింగ్స్ బట్టే ప్రకటనలు కంపెనీలు ఇస్తుంటాయి. పై సమాచారం ఏ ఛానల్ కు ప్రజలు ఎంత విలువ ఇస్తున్నారో తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మీ ముందు ఉంచుతున్నాము.

 

 

Ram
Ramhttps://oktelugu.com/
An Independent Editor, Trend Stetting Analyst.
Exit mobile version