Pulse of the Karnataka State: అధికారంలోకి రావాలి కాబట్టి… అధికారంలోకి వస్తేనే అన్ని పనులు జరుగుతాయి కాబట్టి.. పైగా భారీగా వెనకేసుకోవచ్చు కాబట్టి.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించాలి. అవసరమైతే ఒక నాలుగు పథకాలను మరింత అదనంగా ప్రవేశపెట్టాలి. ఉచితంగా బియ్యం ఇవ్వాలి. ఉచితంగా కరెంటు ఇవ్వాలి. ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పించే సౌకర్యం ఇవ్వాలి. వ్యవసాయానికి పెట్టుబడి సహాయం అందించాలి. పంట కొనుగోలు చేస్తే బోనస్ ఇవ్వాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ఉచితాలు ఇచ్చుకుంటూ నే పోవాలి. అయితే ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే అధికారం సుస్థిరమవుతుందా.. కచ్చితంగా పరిపాలన కొన్ని ఏళ్లపాటు చేతిలో ఉంటుందా.. ఈ ప్రశ్నలకు సమాధానం నో అనే వస్తోంది. దీనికి కర్ణాటకలో ప్రస్తుతం జరిగిన ఓ సర్వే స్పష్టమైన సమాధానం చెబుతోంది.
కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో క్రమంగా మార్పు మొదలైంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కర్ణాటకలో ఓ సంస్థ చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగిపోయే ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. ఉచిత పథకాలతో ప్రజలను ఏమార్చి.. అధికారంలోకి వచ్చిన ప్రతి రాజకీయ పార్టీకి కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు ఒక గుణపాఠం లాంటివి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, వంటి వారు మాత్రమే కాదు రాహుల్ గాంధీ, సునీల్ కొనుగోలు వంటి వారు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి చాలా నేర్చుకోవాలి.
Also Read: Leopards and Humans Live Together: అక్కడ చిరుతపులులు సాధు జంతువులు.. మనుషులతో కలిసి జీవిస్తాయి!
కన్నడ సీమలో ఇప్పటికిప్పుడు ఒకవేళ ఆ రాష్ట్ర విధాన సభకు ఎన్నికల జరిగితే కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణమైన ఓటమిని మూట కట్టుకుంటుందట. దీనికి సంబంధించి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ పేరుతో ఒక సర్వేను చేసింది. వాస్తవానికి కర్ణాటకలో 1985 నుంచి అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తదుపరి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో మెజారిటీ సాధించిన దాఖలాలు లేవు. ఈ సర్వే సందర్భంగా ఈ విషయాన్ని ప్రముఖంగా గమనించాలి.. ఇక పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ కలిసి కర్ణాటక రాష్ట్రంలో 10,481 శాంపిల్స్ సేకరించాయి. గత నెల 17 నుంచి ఈనెల 18 వరకు నెల రోజులపాటు ట్రాకర్ పోల్ నిర్వహించాయి. కర్ణాటక రాష్ట్రంలో 224 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 113 స్థానాలలో విజయం సాధించాలి.
ఇప్పటికిప్పుడు అక్కడ ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న బిజెపి 51 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉంది. ఈ లెక్కన 136 నుంచి 159 స్థానాలు గెలుస్తుందని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 40.3% ఓట్లతో 62 నుంచి 82 స్థానాలు సాధిస్తుంది. ఇక జెడిఎస్ 5% ఓట్లతో మూడు నుంచి 6 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42.88 శాతం ఓట్లను సాధించింది. 66 స్థానాలు గెలుచుకుంది. జెడిఎస్ 13.29 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలుపొందింది. అంటే కేవలం రెండు సంవత్సరాలలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ సాగుతోంది. 6 గ్యారెంటీలు అంటూ అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో విఫలమైంది. పరిపాలనలో అట్టర్ ప్లాఫ్ అయింది.
Also Read: AP CM Chandrababu : ఆ రాష్ట్రం నుంచి ఏపీకి మరో భారీ ప్రాజెక్టు.. చంద్రబాబు స్కెచ్!
హిందూ సామాజిక వర్గం బిజెపికి 58.5 శాతం జై కొడుతుంటే.. కాంగ్రెస్ పార్టీకి 32 శాతం అనుకూలంగా ఉంది. ముస్లిం సామాజిక వర్గం లో 85.5% కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటే.. బిజెపికి కేవలం 9.3% మాత్రమే పాజిటివ్ గా ఉందని ఈ సర్వేలో తేరింది. ఇక లింగాయత్ సామాజిక వర్గం బిజెపికి 78.9 శాతం జై కొడుతుంటే.. కురుబ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి 54.6% జై కొడుతోంది. ఒక్కలిగా సామాజిక వర్గంలో బిజెపికి 47.8%, జెడిఎస్ 24.6%, కాంగ్రెస్ పార్టీకి 22.9 శాతం ఆదరణ లభిస్తుందని తెలుస్తోంది.. ఇక బిజెపికి సమర్థవంతమైన నాయకుడు లేకపోవడంతో ప్రధాన అపరితంగా ఉంది.. ఇక కర్ణాటకలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. సిద్ధరామయ్య వైపు 29.2%, డీకే శివకుమార్ వైపు 10.7%, కుమారస్వామి వైపు 7.6%, యడ్యూరప్ప వైపు 5.5%, కర్ణాటక బిజెపి ప్రెసిడెంట్ బివై విజయేంద్ర వైపు 5.2% ప్రజలు సపోర్ట్ గా ఉన్నారు. ఇక ఈ సర్వేలో తెలుగు ప్రాంత నేతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. అధికారంలోకి రావాలంటే ప్రకటించాల్సింది ఉచితాలు కాదు. అమ్మాల్సింది ప్రభుత్వ భూములు కాదు.. సమర్థవంతమైన పరిపాలన.. పటిష్టమైన అభివృద్ధి..కానీ వీటికి దూరంగా తెలుగు ప్రాంత నేతలు దూరంగా ఉంటున్నారు. పంచుడు పథకాలకు జై కొడుతున్నారు.