AP CM Chandrababu : ఏపీకి( Andhra Pradesh) భారీగా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అవి విజయవంతం అయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఏపీలో ప్రతిపాదిత ప్రాజెక్టులకు సంబంధించి కీలక చర్చలు జరిపారు. మరోవైపు ఈరోజు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనున్నారు. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాలలో పరిశ్రమల స్థాపనకు, సైనిక్ స్కూలు, డి ఆర్ డి ఓ సెంటర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి సంబంధించి అనువైన పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడు రోజుల పర్యటన నిమిత్తం గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు చంద్రబాబు. నిన్న రోజంతా బిజీబిజీగా గడిపారు. ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసి చర్చలు జరిపారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ఏపీకి రానున్నారు.
* రక్షణ మంత్రి దృష్టికి..
ప్రధానంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన చంద్రబాబు( AP CM Chandrababu) రాష్ట్రానికి సంబంధించి కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనను పెట్టారు. రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ఆయనకు విన్నవించారు. లేపాక్షి- మడకశిర మధ్య అందుబాటులో ఉన్న పదివేల ఎకరాల్లో సైనిక, పౌర విమానాల తయారీ, రక్షణ రంగ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఏరో స్పేస్ ఏకో సిస్టం ఏర్పాటు చేయాలని కోరారు. కర్ణాటక నుంచి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, అడ్వాన్సుడ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్పత్తిని ఏపీకి తరలించాలని ప్రతిపాదించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి లేపాక్షి- మడకశిర వెళ్లాలంటే గంట సమయం మాత్రమే పడుతుందని చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పదివేల ఎకరాలను ఇందుకు ప్రతిపాదించారు చంద్రబాబు. అయితే ఈ ప్రాజెక్టు విలువ వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో ఆర్మీ కంటోన్మెంట్ ఏర్పాటు చేయాలని కోరారు. కొత్తగా సైనిక్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : జగన్ అరెస్ట్.. చంద్రబాబుకు కేంద్ర పెద్దల సూచన అదే!
* కీలక ప్రతిపాదనలు..
కేంద్ర రక్షణ రంగానికి( Defence Services) సంబంధించి ప్రాజెక్టులు ఏపీకి కేటాయించాలని కోరారు. జగ్గయ్యపేట- దొనకొండ క్లస్టర్ లో ఆరువేల ఎకరాల్లో క్షిపణులు, ఆయుధ సామాగ్రి ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అలాగే విశాఖలో నౌకా రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి, ఆయుధాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు జిల్లాలో సైతం నాలుగువేల ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. అక్కడ సైనిక డ్రోన్లు, రోబోటిక్స్ , ఆధునిక రక్షణ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు.
* కేంద్ర ప్రాజెక్టులకు మోక్షం..
వీలైనంతవరకు కేంద్ర ప్రభుత్వం ( central government)నుంచి కీలక ప్రాజెక్టులను ఏపీకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా భూములు అప్పగిస్తామని హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ అవసరాల దృష్ట్యా టిడిపి కీలకం. అందుకే టిడిపి నుంచి వెళ్లిన ప్రతి ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తోంది. నిన్న రోజంతా కేంద్ర మంత్రులను కలిసిన సీఎం చంద్రబాబు.. ఏపీకి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్టుల విషయాన్ని తీసుకెళ్లారు. అంతటా సానుకూలత కనిపించడం విశేషం.