Homeజాతీయ వార్తలుProvident Fund New Rules: ఇక మీదట అద్దె కాదు.. ఈఎంఐ కట్టండి.. పీఎఫ్ తో...

Provident Fund New Rules: ఇక మీదట అద్దె కాదు.. ఈఎంఐ కట్టండి.. పీఎఫ్ తో సొంతింటి కల సాకారం

Provident Fund New Rules: సొంత ఇల్లు కట్టుకోవాలని, ప్రశాంతంగా బతకాలని చాలా మంది కలలు కంటుంటారు. వారి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, పీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా తీసుకునే నియమాలను మార్చింది. కొత్త నియమాల ప్రకారం ఇప్పుడు ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్, ఈఎంఐ కట్టడానికి మీ పీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తం నుంచి 90శాతం వరకు తీసుకోవచ్చు. ఈపీఎఫ్ స్కీం 1952లోని పారా 68-బీడీ ప్రకారం, పీఎఫ్ అకౌంట్ హోల్డర్లు ఇప్పుడు తమ అకౌంట్ ఓపెన్ చేసి మూడేళ్లు దాటితే 90శాతం వరకు తమ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ డబ్బులను ఇల్లు కొనడానికి, ఇల్లు కట్టుకోవడానికి లేదా ఈఎమ్‌ఐ కట్టడానికి ఉపయోగించుకోవచ్చు. గతంలో ఈ ఫెసిలిటీ ఐదు సంవత్సరాల తర్వాతే లభించేది. అంతేకాకుండా, పాత రూల్స్ ప్రకారం, ఏవైనా హౌసింగ్ స్కీమ్‌లలో చేరిన వారికి ఈ అవకాశం ఉండేది కాదు.

Also Read:  ప్రజాప్రతినిధి జీతం ఖర్చులకు చాలదు… ఇంకో ఉద్యోగం చేయాల్సిందే!

ఈ ఏడాది జూన్ నెల నుంచి ఈపీఎఫ్ఓ సభ్యులు యూపీఐ, ఏటీఎం ద్వారా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో రూ. లక్షవరకు తక్షణమే విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ లిమిట్ ను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. గతంలో క్లెయిమ్‌లను 27 పారామీటర్ల ఆధారంగా పరిశీలించే వారు. ఇప్పుడు కేవలం 18 పారామీటర్ల ఆధారంగా మాత్రమే కన్ఫాం చేస్తున్నారు. ప్రస్తుతం 95శాతం కేసులలో 3-4 రోజుల్లోనే క్లెయిమ్‌లు పరిష్కారమవుతున్నాయి. అవసరమైన ఖర్చుల కోసం పీఎఫ్ నుంచి డబ్బు తీసుకునే ప్రక్రియను కూడా చాలా సులభతరం చేశారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది.

ఈ కొత్త నియమాల ప్రధాన లక్ష్యం పీఎఫ్ మెంబర్లు ఈజీగా ఇల్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహించడం. అలాగే, డౌన్ పేమెంట్ ప్రాబ్లం తగ్గించి, నిరుపయోగంగా ఉన్న పొదుపును ఉపయోగకరంగా మార్చడం. అయితే, ఈ విత్‌డ్రా ఫెసిలిటీ జీవితంలో ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకోవడం మరింత సులభతరం చేసేందుకు మాత్రమే ఇలాంటి కీలక మార్పులు చేపట్టారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular