https://oktelugu.com/

జర్నలిస్టులకు బీమా కల్పించాలి: పవన్ కల్యాణ్

దేశంలో లాక్డౌన్ ప్రతీఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, పోలీసులు కరోనాపై పోరాటం చేస్తుండగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇక పారిశుధ్య కార్మికులు వీధుల్లో ఉంటూ కరోనా మహమ్మరి ప్రబలకుండా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 23, 2020 / 07:49 PM IST
    Follow us on


    దేశంలో లాక్డౌన్ ప్రతీఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా లాంటి విపత్కర సమయంలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, పోలీసులు కరోనాపై పోరాటం చేస్తుండగా క్షేత్రస్థాయిలో జర్నలిస్టులు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ఇక పారిశుధ్య కార్మికులు వీధుల్లో ఉంటూ కరోనా మహమ్మరి ప్రబలకుండా చర్యలు చేపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇటీవల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత తన ట్వీటర్లలో జర్నలిస్టులపై స్పందించారు. జర్నలిస్టులు సమాచార సేకరణలో భాగంగా వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మీ కుటుంబానికి మీ అవసరం చాలా ఉందని.. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించిన సంగతి తెల్సిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా విపత్తులోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్య బీమా కల్పించాలని ఆయన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జర్నలిస్టులు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ విధులు చేపట్టాలని ఆయన సూచించారు.

    చైన్నెలో 25మంది, ముంబైలో 50మందికి పైగా జర్నలిస్టులు కరోనా బారినపడ్డారని గుర్తుచేశారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోని జర్నలిస్టులు క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలిసిందని పవన్ తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, మీడియా సంస్థలు పాత్రికేయుల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు, పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమా కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థిత్లుల్లోనూ ధైర్యంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశారు.