https://oktelugu.com/

దాతల సాయాన్ని దోచేస్తున్నారు!

ట్రస్ట్ పేరిట కొందరు వ్యక్తులు దాతల సాయాన్నీ దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పేదలకు సాయం చేయకుండా తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కరోనా’ కేసులపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విపత్కర సమయంలో అసత్య ప్రచారాలు సరికాదని, ‘కరోనా’ కట్టడిపై శాస్త్రవేత్తలతో ప్రభుత్వం చర్చించాలని, రాజకీయాలపై కాకుండా పేదలకు సాయం చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. […]

Written By: , Updated On : April 23, 2020 / 07:47 PM IST
Follow us on


ట్రస్ట్ పేరిట కొందరు వ్యక్తులు దాతల సాయాన్నీ దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. పేదలకు సాయం చేయకుండా తమను అడ్డుకుంటున్నారని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కరోనా’ కేసులపై ఏపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. విపత్కర సమయంలో అసత్య ప్రచారాలు సరికాదని, ‘కరోనా’ కట్టడిపై శాస్త్రవేత్తలతో ప్రభుత్వం చర్చించాలని, రాజకీయాలపై కాకుండా పేదలకు సాయం చేయడంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు.

రాష్ట్రంలో దినసరి కూలీల పరిస్థితి దారుణంగా ఉందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదని, జగన్ తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. మన రాష్ట్రంలో స్వస్థలాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలను, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కూలీలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.