Secunderabad Agnipath Protests: అగ్నిపథ్ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష నేపథ్యంలో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో యువత పోలీసులు, రైళ్లపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పలు రైళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా త్రివిధ దళాళ్లో చేర్చుకునేందుకు ఉద్దేశించిన అగ్నిపథ్ నియామకాలపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొని ఉత్తీర్ణులైనా దాన్ని రద్దు చేయడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇలాగైతే తమకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్, హకీంపేట ర్యాలీలు నిర్వహించినా నియామకాలు చేపట్టలేదు. దీంతో తమకు ఉద్యోగాలు రావడం లేదు. ఇలా అన్నింటిని రద్దు చేస్తూ పోతే మా వయసు దాటిపోవడంతో యువతలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గొడవకు దిగారు. పలు రైళ్లపై దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన విరమించాలని సూచించినా వినిపించుకోలేదు. అగ్నిపథ్ నియామక విధానంపై విరుచుకుపడ్డారు.
Also Read: Corporate Power- Indian Politics: అధికారంలో ఉండేది పార్టీలు శాసించేది కార్పొరేట్లు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లతోపాటు దుకాణాలు, డిస్ ప్లే బోర్డులు ధ్వంసం చేసిన ఆందోళనకారులు. రైళ్లకు నిప్పు పెట్టడంతో ప్రయాణికుల్లో ఆందోళన. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు భద్రత కల్పిస్తున్న పోలీసు అదికారులు. గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు. ఆందోళనలో నిర్మల్ కు చెందిన దామోదర్ ఖురేషియా మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇంకా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. యువకులు కర్రలతో వీరంగం సృష్టించారు.
అగ్నిపథ్ రద్దు చేయకపోతే ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. పోలీసుల ఆంక్షలను పట్టించుకోవడం లేదు. వారి సూచనలు పాటించడం లేదు. ఫలితంగా నిరసన ఇంకా పెచ్చుమీరుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే తాము ఆందోళన చేస్తున్నామని యువకులు చెబుతున్నారు .మొత్తానికి హైదరాబాద్ నగరం అట్టుడుకుతోంది. ఎటు చూసినా ఆందోళన కారుల విధ్వంసమే కనిపిస్తోంది. నిరుద్యోగులంతా వాట్సాప్ గ్రూపులో సందేశాల ద్వారా గుమిగూడి ఆందోళనకు ఉపక్రమించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రభస సృష్టించారు.
దీంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు. రైళ్లకు నిప్పుపెట్టడంతో పోలీసులు అడ్డుకోవాలని ప్రయత్నించినా వారిని లెక్కచేయలేదు. రో డ్డుపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేస్తున్నారు. ఆందోళన విరమించడం లేదు. గొడవ తగ్గుముఖం పట్టడం లేదు. అగ్నిపథ్ రద్దు చేసి గతంలో నిర్వహించిన ర్యాలీల్లో ప్రతిభ చూపిన వారికి ఉద్యోగాలు కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిరసన ఎంతవరకు వెళ్తుందో తెలియడం లేదు. పోలీసులు మాత్రం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read:BJP Politics: రాజకీయ ప్రత్యుర్థులే అవినీతి పరులా..? సొంత పార్టీలోని వారు నీతిమంతులా..?